పుట:Gurujadalu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్యాశుల్కము ద్వితీయాంకము వస్థలము : కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్ని హోత్రావధాన్లు ఇల్లు (అగ్నిహోత్రావధాన్లు జంఝాలు వడుకుచుండును. కరటక శాస్త్రుల్లు శిష్యుడిచేత లేనిపేలు నొక్కించుకొను చుండును. వెంకమ్మ కూర తరుగుచుండును) వెంకమ్మ : నిన్నట్నించి కిశిమీశ్శలవులని కుఱ్ఱవాడు వుత్తరం రాశాడు. యెన్నాళ్ల ఐంది వాణ్ణి చూసి, కళ్లు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. అగ్ని హోత్రావధాన్లు : ఎందుకు వొట్టినే వగచడం? వొద్దు వొద్దంటూంటే యీ యింగ్లీషు చదువులో పెట్టావ్. మెరకపొలం సిస్తంతా వాడి కిందయి పోతూంది. కిందటి యేడు పరిక్ష ఫీలయిపోయినాడు గదా? యీ యేడు యెలా తగలేశాడో తెలియదు. మనకీ యంగిలీషు చదువు అచ్చిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావుధాన్లు కొడుకుని యింగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం వొచ్చి మూడ్రోజుల్లో కొట్టేశింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావం నుకుంటూండగానే చచ్చినంత ఖాయలా చేసింది. వెంకమ్మ : మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంమౌవుంఛారు. డబ్బు కర్చయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న మనకళ్లెదట మనవాకట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుత్థాడికి మునసబీ ఐంది కాదూ? అగ్ని : మన వెధవాయకి చదువొచ్చేదేం కనపడదు గాని పుస్తకాల కిందా జీతం కిందా యహ నాలుగేళ్ళయే సరికి మన భూమి కడితేరిపోతుంది. ఆ పైని చిప్పా దొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా యింటి దగ్గరుంటే యీపాటి నాలుగష్టాలు చెప్పేదును. వొద్దంటూంటే యీ వెధవింగిలీషు చదువులో పెట్టావు. వెంకమ్మ : మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అగ్స్ఫరారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూల్డూపాయలు కర్చు పెట్టడానికింత ముందూ వెనకా చూస్తున్నారు. మీలాగే వాడూ జంఝూలు వొడుక్కుంటూ బతకాలని వుందా యేవిఁషి? మీకంత భారవco తోస్తే మావాళ్ళు నాకు పసుపూ కుంకానికీ యిచ్చిన భూవఁమ్మేసి కుజ్జాడికి చదువు చెప్పిస్తాను. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 231