పుట:Gurujadalu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గానీ అంటివా, చూడు నా తడాఖా. యవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా? మధు : రామ. రామ : (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది! మధు : రామ! రామ! ఒహరు చెప్పేదేవిఁటి లోకవళంతా కోడై కూస్తూంటేను? (వీధిలో నుంచి తలుపు తలుపు అని ధ్వని) గిరీ : (తెల్లపోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు, ఆ పిలిచే మనిషి వెజ్జిముండ, మనుషుల్ని కరుస్తుంది. మధు : తలుపు తీసేవుంది. గిరీశం: చంగున వెళ్ళి గడియవేసెయ్. మధు : అదుగో తలుపు తోసుకు వొస్తూంది. గిరీ

గెంటేయ్, గెంటెయ్

మధు : ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (మధురవాణి వాకట్లోకి వెళ్లును). గిరీ : మంచం కింద దూరుదాం (గిరీశం మంచం కింద దూరును). (తనలో) దొంగలంజ - సరసుణ్ణి దాచిందోయ్ మంచం కింద. యిదేవిఁటో మంచిమనిషి అని భ్రమించాను. దీనస్సా గొయ్యా. సిగపాయి దీసి తందును గాని యిది సమయం కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రొపు, (రామప్పంతులుతో మెల్లిగా) యవరన్నా మీరు, మహానుభావులు? రామ : నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ. గిరీ : తమఁరా, యీ మాత్రానికి మంచం కింద దాగోవాలా, మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవై మందిని మీకు కన్యాదానం చేతునే. రామ : (తనలో) బతికాగ్రో దేవుఁడా; (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! అలా తెలిస్తే నే రాకపోదును సుమా. గిరీ : మాటవినపళ్లేదు. కొంచం యిసుంటారండి (రామప్పంతులు ముందుకు జరుగును, గిరీశం అతన్ని తప్పించుకుని గోడవేపు చేరును) గిరీ

అన్నా యీ లంజని యన్నడూ నమ్మకండీ, యిలా యిరవై మందిని దాచగల శక్తుంది,

దీనికి. గురుజాడలు 228 కన్యాశుల్కము - మలికూర్పు