పుట:Gurujadalu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : రెండు వందలు దొబ్బిందిరా బాబూ. గిరీ : నువ్వులేం జాగర్త చేశారా? రామ : అంతేనా ? గిరీ : మరేవిఁటి ? మధురవాణిన్ని, పూటకూళ్లమ్మ వల్లెవాటులో చీపురుగట్టదాచిన్ని ప్రవేశింతురు. ) మధు : మీరన్న మనిషి యిక్కడ లేరంటే చెవిని బెట్టరు గదా! పూట : నీ యింట్లో జొరబడ్డాడని వీధులో వాళ్లు చెబితే నీ మాట నమ్ముతానా యెవిఁటి? ఆ వెధవ వుంటే, నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్. మధు : యవడికిచ్చావో వాళ్లే అడగవమ్మా. పూట : వెధవ కనబడితే సిగపాయిదీసి చీపురుగట్టతో మొత్తుదును, యెక్కడ దాచావేవిఁటి? మధు : నాకు దాచటం ఖర్మవేఁవిటీ? నేను మొగనాల్ని కాను. వెధవముండనీ కాను. నా యింటి కొచ్చేవాడు మహరాజులాగ పబ్లిగ్గా వొస్తాడు (కంటితో మంచము కిందు చూపును) పూట : మంచంకింద దాగాడేమో (మంచము కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే వుంది లేచిరా. (చీపురు గట్ట తిరగేసి రామప్పంతులును కొట్టును) రామ : ఓర్నాయనా, నన్నెందుక్కొడతావే దండు ముండా? (మంచంకింది నించి పైకి వచ్చి వీపు తడుముకొనును). మధు : ఆయన్నెందుకు కొట్టావు? నాయింటికొచ్చి యేవిఁటీ రవ్వ? పూట : అయితే మంచంకిందెందుకు దూరాడూ? మధు: నీ కెందుకా గోష? అదో సరసం. పూట : యిదో చీపురుగట్ట సరసం. రామ : (వీపు తడువుఁకుంటూ) నీ సిగతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసిపోదును. నీ రంకు మొగుణ్ణి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకు తోసి తాను గోడవేపు దాగున్నాడు. పూట : ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద! కుక్కా పైకిరా. గిరీ

వెఱ్ఱప్పా! మంచంకిందికిరా, వెట్టి వొదల గొడతాను.

కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 229