పుట:Gurujadalu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీ : యింత శుభవార్త తెచ్చినా, దగ్గరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్ వస్తావా? మధు : (తలతిప్పుతూ) నే యెందుకు! పూటకూళ్లమ్మని తీసికెళ్లండి. గిరీ (నిర్ఘాంతపోయి) పూటకూళ్లమ్మ యేవఁయినా పెంట పెడుతూండా యేవిఁటి? మధు : మీకే తెలియాలి. గిరీ : నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వొస్తూంది. యెవడేమాటన్నా నా మీద నమ్మడవేడ నా? యీ ఘోరమైన అబద్ధాలు నీతో యవడు చెబుతున్నాడో కనుక్కోలేననుకున్నావా యేవిఁటి? సప్త సముద్రాల్లాటినా వాడి పిలకట్టుకుని పిస్తోల్తో వొళ్ళు తూట్లు పడేటట్టు థాథామని కొట్టకపోతినట్టయినా నా పేరు గిరీశమే, నినద భీషణ శంఖము దేవదత్తమే! కబడ్డార్! మధు : సముద్రాలవతల కెళ్ళి వెతకకర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యదటే చెబుతాడు. రామ : (తనలో) యీ ముండ నన్ను బయలుబెడుతుంది కాబోలా దైవమా! గిరీ : (తనలో) థాంక్గాడ్. అయితే పూటకూళ్ల దానెబ్బ తగల్లేదు. (పైకి) యిలాంటి దుర్మార్గప కూతలు ఆయిల్లాలు చెవిని పడితే చాలా భేదిస్తుంది. ఆ పాపవఁంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత! యంత యోగ్యురాలు! మధు : వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట యీనాటికి విన్నాను. గిరీ : దానికి... కాదు ఆమెకి మొగుళ్లేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు. మధు : మీరుండగా వెధవెలా అవుతుంది? గిరీ : నాన్సెన్స్ (దీనికో రస్సా చెప్పి రంజింపచేదాం) యిదుగో విను. దాని నిజం యెవిఁ టంటే-పూటకూళ్లమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేశే రోజుల్లో ఒక కుసుమ ముసలా డికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్టబోతూంటేనో కట్టిన వుత్తర క్షణంలోన్నో ఆ ముసలాడు పెళ్లి పీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్లి అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తకట్టాడన్నారు. కొందరు కట్టలేదన్నారు. పిల్లతండ్రి, పెళ్లికొడుకు వారసులుమీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ల దగ్గర లంచం పుచ్చుకుని పుస్తె కట్టలేదని సాక్షేవిఁచ్చాడు. దాంతో కేసు పోయింది; మరిదాన్నెవరూ పెళ్లాడారు కారు. మధు : అయితే మరి మీకు తప్పలేదే? గిరీ : యేవిఁటి యీ కొత్త మాటలూ! నాకు ఆదీ అంతూ తెలియకుండా వుందీ! ఆహాఁ సరసం విరసంలో దిగుతూందే! హాస్యానికంటే నివ్వేవఁన్నా ఆనందవేఁ, నిజవఁని గురుజాడలు 227 కన్యాశుల్కము - మలికూర్పు