పుట:Gurujadalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురజాడ అసంపూర్ణ రచనలు (1) Rev and the Hero, (2) A Novel - few scenes (3) రక్షస తంగడి యుద్ధం నేపథ్యంలో గురజాడ రాయతల పెట్టిన నవల / నాటకం తాలూకు నోట్సు (4) చిత్రాంగి పేరుతో గురజాడ రాసిన ఇంగ్లీషు నాటకంలో ఇప్పుడు మిగిలిన కొన్ని పుటలు (5) మరికొన్ని అసంపూర్ణ వ్యాసాల టైపు పుటలు కూడా ఉన్నాయి. వీటిలో 3, 4 అంశాలకు సంబంధించి గురజాడ స్వహస్తాలతో రాసి పెట్టుకున్న కాగితాలు A.P. State Archives, Hyderabadలో గురజాడ ‘సంచయం'లో ఉన్నాయి. సౌకర్యం కోసం వీటన్నిటినీ M.O. లో చేర్చి 1. M.O., 2. H.H. 3. Creative Writings 4. Miscellaneous Works అని నాలుగు శీర్షికలుగా విభజించాము. గురజాడ దినచర్యల్లో ఖాళీపుటల్లో రాసుకొన్న నోట్సు కూడా M.O.లో చేర్చాము. Unilit (1963) గురజాడ విశేషసంచికలో ప్రచురించిన వ్యాసాలను కూడా M.O. లోనే చేర్చాము.

సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన “గురజాడ రచనలు - కవితల సంకలనం”లో “ఎమరాల్డ్సు' పేరుతో రెండు ఇంగ్లీషు పొయెము ఉన్నాయి. ఇందులో ఒకటి ఒక పార్సీ గీతానికి అనువాదంలాగుంది. కే.వి.ఆర్. సంపాదించిన టైపు ప్రతిలో ఈ గీతం ప్రతిపైన ఒక మూల H.H. అని గుర్తుగా టైపు చేసి ఉంది. అందువల్ల ఈ కవితను H.H. శీర్షికలో చేర్చాము. ఈ 'ఎమరాల్డ్సు' పోయమ్స్ తర్వాత అదే పుటలో 'How he did it' అనే కవిత ఉంది. ఇందులో కొన్ని పాదాలు జారిపోయినట్లనిపించింది. దీన్ని ఎటువంటి మార్పులు చెయ్యకుండా అనుబంధంలో చేర్చాము.

1912లో గురజాడ హిందూపత్రికకు రాసిన రెండు సంపాదకీయ లేఖల్లోంచి కొన్ని భాగాలు మాత్రం ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఆ భాగాలను కూడా M.O. లో చేర్చాము.

1908 డిసెంబరు 27, 28, 29 తారీకుల్లో మద్రాసులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు గురజాడ హాజరయ్యారు. ఆ సభల నిర్వహణమీద, ఉపన్యాసాల మీద ఆయన హిందూపత్రికలో హాస్యం, వ్యంగ్యం కలగలిపి ఒక వ్యాసం రాశారు. అవసరాల సూర్యారావు, సెట్టి ఈశ్వరరావు ఇద్దరూ ఈ వ్యాసాన్ని తెలిగించారు. ఈ వ్యాసం మధ్యలో గురజాడ ఒక పేరడీ కవితను చేర్చారు. అవసరాల ఈ కవితను తన అనువాదంలో యథాతథంగా ఇవ్వబట్టి ఈ కవితైనా మనకు దక్కింది, మిగతా వ్యాసం మటుకు గురజాడ అలబ్ధ రచనల జాబితాలో చేరిపోయింది - ప్రస్తుతానికి.

ఆంధ్రభారతిలో అచ్చయిన కథలు మినహాయిస్తే, గురజాడ మిగతా కథలు ఏ పత్రికల్లో అచ్చయ్యాయో తెలీదు.