పుట:Gurujadalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"Stooping to raise" కథ ఆనాటి ఇంగ్లీషు కథల పత్రికల్లో ప్రచురించబడి ఉండవచ్చనే ఆశతో గోపాలకృష్ణ లండన్‌లో మిత్రుల ద్వారా ప్రయత్నం చేశారు. కాని, ఫలితం లేకపోయింది. ప్రసిద్ద చిత్రకారులు, రచయిత శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధించి ఒక ముచ్చట చెప్పారు. శ్రీ పోతుకూచి సాంబశివరావుగారు గురజాడ శతజయంతి సందర్భంగా Unilit విశేష సంచిక (1963)ను వెలువరిస్తున్న సందర్భంలో విజయవాడలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగి ఒకరు Stooping to raise కథను ఎనిమిది వందల రూపాయలకు అమ్మజూపాడట. అంత పెద్దమొత్తం సమకూడక ఆ అవకాశాన్ని సాంబశివరావుగారు వదులుకోవలసి వచ్చిందట! వేపా రామేశం చేత తన కథకు పరిచయ వాక్యాలు రాయించుకొన్నట్లు గురజాడ దినచర్యలో రాసుకొన్నారు. ఆ కథ ఏమయిందో తెలీదు.

అవసరాల సూర్యారావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన గురజాడ కథా సంపుటంలో పెద్దమసీదు, మెటిల్డా రెండు కథలున్నాయి. ఈ రెండు కథలు అంతకుముందే, అంటే 1950లో వావిళ్ళ ప్రచురణ సంస్థ అచ్చువేసిన “మహాకవి అప్పారావు గారి చిన్న కథలు” సంపుటంలో కన్పిస్తాయి. వావిళ్ళవారి పుస్తకంలో “మతము-విమతము” పేరుతో ఉన్న కథ విశాలాంధ్ర ప్రచురించిన పుస్తకంలో “పెద్దమసీదు” పేరుతో ఉంది. ఈ మార్పు కే.వి.ఆర్.కు తెలియకపోలేదు. ఆయన కూడా మహోదయంలో “పెద్దమసీదు” పేరుతోనే ఈ కథను పేర్కొన్నారు. గురజాడ ఇంగ్లీషులో M.O. నోట్సులో స్పష్టంగా ‘భట్రాజుగారబ్బాయి' అని పేర్కొంటే అవసరాల 'భ' గారబ్బాయిగా మార్చారు. హిందూ మహమ్మదీయ సంస్కృతుల మధ్య వైరుధ్యాల నేపథ్యంలో కథ రాయాలని గురజాడ M.O. లో రాసుకున్నారు. మతము-విమతము కథా వస్తువు అదే. ఈ కథలో భాషను గమనిస్తే గ్రాంథికభాషాస్పర్శ అధికంగా ఉన్నట్లు తోస్తుంది. ఇదే గురజాడ తొలికథేమో?

మద్రాసులో వంటమనిషి చెప్పిన కథ గురజాడ వివరంగా దినచర్యలో రాసుకున్నారు. ఈ సంఘటనే మెటిల్డా కథకు ప్రేరణ అయి ఉండవచ్చని కే.వి.ఆర్. భావించారు.

ఈ సంపుటం తయారుచెయ్యడంలో ఎందరో సహాయ సహకారాలు అందించారు. డిసెంట్ నోట్లో, శ్రీరామ విజయ వ్యాయోగం పీఠికలో గురజాడ ఉదాహరించిన శ్లోకాలపాఠాన్ని నిర్ణయించి సహకరించిన వారు ప్రొఫెసర్ రామకృష్ణమాచార్యులవారు (కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి). మనుస్మృతి శ్లోకాన్ని సరిచూసి పంపిన మిత్రులు డాక్టర్ శ్రీరంగాచార్య (హైదరాబాద్), సారంగధర, ఇతర ఇంగ్లీషు కవితలు చదివి కొన్ని సూచనలు చేసినవారు శ్రీ వేదం వెంకటరామన్ (నెల్లూరు వి.ఆర్. కళాశాల విశ్రాంత ఆంగ్ల అధ్యాపకులు), శ్రీ మైదవోలు సత్యనారాయణ (నెల్లూరు). గురజాడ దినచర్యలు చదివి గోపాలకృష్ణ మిత్రులు వి.ఏ.కె.