పుట:Gurujadalu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్యాశుల్కము

తృతీయాంకము

గిరీశ : (కాముని విరిశముల బారికినే అను జావళీ కూనురాగముతో పాడుచు ప్రవేశించి తనలో) ఇన్నాళ్లకు మిడతంభొట్లు చేతిలో చిక్కాడు. యేమీ పాలుపోకుండా వున్నది. యీ విడోబ్యూటీ చూస్తే యేమీ తోచదు. అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యేది కాదు. ఇంత సింప్లిసిటీ యెక్కడా నేను చూడలేదు. దీనికీ లవ్ సిగ్నల్‌స్ రామరామా! యేమీ తెలియవు. చమత్కారము మాటలు ఆడితే యెంతమాత్రం అర్థం చేసుకోలేదు. యే మాటలన్నా ఆ లేడి కళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్ డ్రెడ్‌పుల్లీ యిన్ లవ్. దీనిని చూచిన దగ్గిరనుంచీ టవున్ లవ్‌సూ డాన్సింగ్ గర్ల్‌సూమీద పరమ అసహ్యం పుట్టింది. పోజిటివ్ యబ్‌హరెన్స్ వాళ్ల పెంకె మాటలు, పెడర్థాలు, వేషాలు, డామిట్ అంతా యిన్‌సిన్ సిరిటీయే కదా? యిన్నాళ్లు వాళ్ల వలలలో పడిపోయి యేలాగు యాస్‌ని అయిపోయినానో ఆశ్చర్యముగా ఉన్నది. దీనికీ వాళ్లకీ కమ్‌పేరిజన్ ఏమిటి? ఇదీ ప్యూర్ డైమండ్, అట్టర్ ఇన్నోసెన్స్. నేను రాత్రిళ్లు అరబ్బీనైట్సు కథలూ, కాశీ మజిలీలూ, ఇతరదేశపు ప్రయాణాల డచ్చీలూ చెప్పడానికి ఆరంభించిన దగ్గరనుంచీ నాదగ్గర బహుచనువుగా నున్నది. ఈ మధ్య వాళమ్మ నూతిలో కాలుజారిపడ్డప్పుడు నేను సాహసించీ ఉరికిపైకి తీసిన దగ్గరనుంచీ నేను బహుయోగ్యుడనని, సత్య హరిశ్చంద్రుణ్ణి అని అనుకుంటూ యున్నది. కథలలో ప్రతిచోటా విధవలు పెళ్ళాడి బహుసుఖముగా ఉండి తుదకు స్వర్గానకు వెళ్లినట్టు సందర్భం తెస్తూవుంటున్నాను. అది కొంచెము బుచ్చమ్మ మనస్సుకు యెక్కివుండదా? అయితే యిప్పుడు సాల్వు కావలసిన ప్రోబ్లెమ్ యేమిటీ? దీనిని పాడు చేదామంటే అది పాపభీతిచేత వొప్పుకోదు. నాకూ యిష్టము లేదు. దీనికి నామీద కొంత ప్రేమయున్నది. నోడౌట్ ఎబౌట్ దట్ అయితే సక్సీడ్ కావడం యేలాగు, దేరీజ్ దీ రబ్. యేమిసాధనం యిటుపైని? టుబీ, ఆర్ నాట్ టుబీ, దట్ ఈజ్ దీ క్వశ్చన్. షేక్స్పియరు ఉన్న అవస్థలో పడ్డాము. యాశస్ బ్రిడ్జి యేదయినా కట్టితేనే కానీ ఒడ్డుచేరే మార్గములేదు. (పైకి ముఖము నెత్తియాలోచించి) ఇక విడో మారేజీ కూడునని బోధపరిచీ రామవరం తీసుకుని వెళ్లిపోవడమే పని, అందుకు వప్పకపోయినా, యీ సంగతి తనవాళ్ళతో చెప్పినా, పీక కోసుకుంటానని చెప్పుతాను. లెట్ మీ బిగిన్ ది కాంపైన్ ఎట్‌వన్స్, (తలుపు కన్నములో నుంచి తొంగిచూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట కొంచెం మ్యూజిక్ విసురుదాము (ఎటులోర్తునే చెలియా అను జావళీ కూను రాగముతో

గురుజాడలు

163

కన్యాశుల్కము - తొలికూర్పు