పుట:Gurujadalu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ్నిహో: లేదండీ దొరగారు స్వయం చేత్తో వ్రాశారు. మఱి వక్కమారు చూడండి.

గిరీశ : ఆలాగు చెప్పండి - యిది లాటిను భాషను వ్రాసినాడు, ఇంగ్లీషు గాని యింకా నేను లాటినుభాష నేర్చుకొనలేదండి.

అగ్నిహో: మా వకీలు చదివేశాడండీ.

గిరీశ: అది యేమాత్రం పనండి. లాటిను వక రోజులో చదువవచ్చును. జరుగురు లేక నేను చదవడం లేదు.

కరటక: (తనలో) వీడిచర్య గమ్మత్తుగా వున్నది.

వెంకటేశ: మా అబ్బాయీ మీరు వక పర్యాయం ఇంగ్లీషు మాట్లాడుతారూ?

గిరీశం: Twinkle! Twinkle! little star,

How I wonder what you are.

వెంకటేశ: There is a white man in the tent.

గిరీశంః The boy stood on the burning deck

Whence all but he had fled.

వెంకటేశంః Upon the same base and on the same side of it the sides of a trapezium are equal to one another.

గిరీశం: Of man's first disobedience and the fruit of that mango tree, sing Venkatesa my very good boy.

వెంకటేశ: Nouns ending in f or fe, change their f or fe into "ves".

అగ్నిహో: ఈ ఆడుతున్న మాటలకి అర్థమేమిటండీ?

గిరీశ : యీ శలవులలో యే ప్రకారం చదవవలెనో అదంతా మాట్లాడుకుంటున్నాము.

కరటక: అబ్బీ వక్క తెనుగు పద్యము ఏదైనా చదువుతారా?

వెంకటే: పొగచుట్టకు సతిమోవికి

కరటక: చబాష్!

గిరీశ: డ్యామిట్ డోన్ట్‌రీడ్డట్. (మెల్లగా) నల దమయంతు లిద్దరు (అని అందిచ్చుచున్నాడు.)

వెంకటే: నలదమయంతు లిద్దరు మన: ప్రభావానలదహ్యమానులై

కరటక: మనః ప్రభవానలమంటే యేమిట్రా అబ్బాయీ?

గురుజాడలు

140

కన్యాశుల్కము - తొలికూర్పు