పుట:Gurujadalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యవనిక వెనుక

హాకవి, యుగకర్త గురజాడ వెంకట అప్పారావుగారి 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన రచనల సర్వస్వం 'గురుజాడలు' తెలుగుజాతికి అంకితం చేస్తున్న సందర్భం ఇది. చిరకాలం ఆనందంగా స్మరించుకోదగిన రోజిది.

2010లో శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ గురజాడ ఉత్తర ప్రత్యుత్తరాల రాతప్రతులను పరిశీలించి, ఇంగ్లీషులో ఉన్న ఆ లేఖలను ఇంగ్లీషులోనే ప్రచురించాలనే ఆలోచనతో కృషి మొదలుపెట్టారు. ఈ సందర్భంలోనే గురజాడ లేఖలను ప్రచురించే అవకాశం ఉంటుందా? అని మనసు ట్రస్టు అధిపతి శ్రీ ఎం.వి.రాయుడు గారిని సంప్రదించారు. ఒక రచయిత సమస్త సాహిత్యాన్ని కలిపి ప్రచురించే సంప్రదాయాన్ని మనసు ట్రస్టు నెలకొల్పిందని, గురజాడ సాహిత్యాన్నంతా సేకరించి ఒక సంపుటంగా ప్రచురించే ఆలోచనలో తాము ఉన్నామని ఆ సంపుటానికి సంపాదకులుగా ఉండమని రాయుడుగారు గోపాలకృష్ణను కోరారు.

గురజాడ రచనలన్నింటిని ఏకఖండంగా భావించి, దాని అన్ని పార్శ్వాలనూ లోతుగా, క్షుణ్ణంగా బేరీజు వేసుకోవలసిన అక్కర ఇంకా తీరలేదని భావించిన గోపాలకృష్ణ మనసు ట్రస్టువారి ప్రతిపాదనను అంగీకరించారు. గురజాడ తెలుగుజాతికి అందించిపోయిన అక్షరసంపదను ఒక కుదురుకు తెచ్చుకొని, మొత్తంగా మరొకసారి మదింపు వేసుకోవలసిన చారిత్రక సందర్భం ఇది అనీ, "ట్రంకుపెట్టె"ల్లో, చీకటిగదుల్లో అజ్ఞాతంగా ఉండి, చెల్లాచెదరై పోయినవి పోగా గురజాడ స్వహస్తాలతో రాసిపెట్టిపోయిన ఈ రచనాశకలాలను ఒకచోట చేర్చి, సమగ్రంగా కాకపోయినా, ప్రయత్నలోపంలేని కృషితో, ఈ సాహిత్య సంపదను భావితరాల వారికి అందజేయాలన్న సదాశయంతో గోపాలకృష్ణ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

మా ఇద్దరి అభిరుచుల్లో సారూప్యత ఉండడంచేత, నెలకొని ఉన్న గాఢమైత్రిచేత, గోపాలకృష్ణ కోరిన వెంటనే నేను ఆయనతో కలిసి పని చెయ్యడానికి అంగీకరించాను. ఒక సుడిగాలిలా రాష్ట్రమంతా తిరిగి ముఖ్యమైన గ్రంథాలయాలలో గురజాడ రచనలకోసం శోధించాము. కన్యాశుల్కం 1897 ప్రతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్‌లోను, చెన్నైలోని జి.ఓ.ఎం.ఎల్.లోనూ కూడా ఉంది. ఆంధ్రభారతిలో అచ్చయిన కథలు సేకరించాము. గురజాడ డిసెంట్ నోట్ కోసం విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది. చివరకు ప్రొఫెసర్ బి.కేశవనారాయణగారు (ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు) ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌కు తెచ్చి ఇచ్చారు.