ఆంధ్ర గ్రంథాలయోద్యమము: సింహావలోకనము
భారతదేశాభ్యుదయనుకొఱకు ఎన్నియో యుధ్యమము లుద్బవించుచున్నవి. ఎన్నియో అంతరించుచున్నవి. కొన్నిమాత్రమే దినదినాభివృద్ధిని గాంచునున్నవి. మన ఆంధ్రగ్రంథాలయోద్యమము ఇప్పటికి రాను రాను ముప్పది సంవత్సరములక్రిందట ప్రారంభమైనదని చెప్పవచ్చును. గడచిన పదునైదు సంవత్సరములనుండి తీవ్రముగా పనిచేయుచున్నది. ఈ కాలమందు ఈయుద్యమ పక్షమున జరిగిన కృషిని సింహావలోకనముగ పరీక్షించి ఈయుద్యమ మిదివరలో దేశోద్ధరణ కెట్టిలాభనష్టములు కల్గాచేసినదియు, ప్రస్తుత దేశకాలపాత్రములనుబట్టి భావికాలమున దేశసేవ చేయగల్గిన శక్తులిందేమైనను నిగూఢమైయున్నదియు మన మిటితరి నిర్ణయించుకొనుట ముఖ్యావశ్యకము. మనదేశమెన్నియోవిధముల దురవస్థయందున్నది. ప్రజల ఆయువు క్షీణించినది. దరిద్రదేవత దేశమంతటను దాండవమాడుచున్నది. ప్రజలు భిన్నభిన్న జాతులుగా చీలిపోయి అంతఃకలహములతో ఒకరితో నొకరికి ఐకమత్యము లేక చీకాకుగా నుండియున్నారు. ఆత్మవిశ్వాసము, స్వయంసహాయతత్వము ప్రజలయఁదు సంపూర్ణముగా నశించినవి. స్వధర్మమును పూర్ణముగా త్యజించి పరధర్మవ్యామోహమున ప్రజణ చిక్కపోయిరి. ప్రజలకళాకౌశల్యము, విద్యాసంపన్నత ప్రజలశక్తుల వికాసమున కుపకరించక యున్నవి. ఈలోపముల నన్నిటిని నివారణ చేయుటకు స్వరాజ్యము ఒక్కటియే పరమసాధనమని అందరును అంగీకరించి యున్నారు. ఈస్వరాజ్యమును స్థాపించుట ఎట్లు. కొందరు బ్రిటిషు ప్రభుత్వము వారు మనలను స్వరాజ్యముకొరకై తయారుచేయుచున్నారనియు, మెట్లవరుసను మనకు ఈపదవిని లంభీంపచేసెదరనియు, ఈతరిబీదు చేయుటకును, ఈ స్వరాజ్యసిద్ధికిని, స్వాధనము నూతనముగా ఏర్పడిన శాసనసభలే ననియును చెప్పుచున్నారు. మీరి మతమున తగిన ప్రతినిధులను ఎన్నుకొని శాసనసభలకు పంపి వారు తమవిధులను సక్రమముగా నిర్వహించునట్లు చేయించగల శక్తి ప్రజలయందు విజృంభించుటయే స్వరాజ్యస్థాపనము. ఇందుకొరకై ప్రజలువిద్యావంతులు కావలెను. ప్రజలయందు ఐకమత్య ముండవలెను. వారు తమవిధులకు, బాధ్యతలను బాగుగా గుర్తెరుగవలెను. పరిపాలనాశక్తి ప్రజలకలడవలెను. మరియోక మతమువారు “ప్రజలు తమ స్వశక్తివలన స్వరాజ్యము సంపాదించవలసినదే గాని బ్రిటిషు ప్రభుత్వమువారు భారతీయులకు నిజమగు స్వరాజ్యము దాసపూర్వకముగా నిచ్చుట కల్ల. ఆట్లు ఇచ్చినను అది భారతీయులు నిల్పుకొనజాలరు. కావున ప్రజలు తమ ఆత్మశక్తిని విజృంపచేసి చేసి స్వరాజ్యమును సంపాదించుకొనవలయు” నని చెప్పుచున్నారు. ఈ రెండు మతముల వారికిని ప్రాప్యమొకటే అయినను దృక్పథము భిన్నము. ఏది ఎట్లున్నను ఈ స్వరాజ్య సౌధనిర్మాణముకొరకు ప్రజలు ప్రప్రథమమున చేయవలిసిన కృషిని గూర్చి మాత్రము స్వదేశీయులేమి, విదేశీయులేమి, అసహాయవాదులేమి, మితవాదులేమి అందరును ఏకగ్రీవముగనే చెప్పుచున్నారు. ఆ యభిప్రాయములను కొన్నిటి నిచ్చట వివరించెదము.
సర్ జా౯లారెన్సు అను ఆంగ్లేయాధికారి 1864 సంవత్సరములో యిట్లు వ్రాసియున్నాడు “ప్రతిగ్రామసంఘమును ఒక్క ప్రజాస్వామిక సంస్థాపనము. ఇది చిరకాలమునుండి వచ్చుచున్నది. బ్రిటిషుగవర్నమెంటువారు తమ బాధ్యతను నిర్వహించుకొనుటకు దేశపరిపాలన ఎంత ఎక్కువవరకు వదలుటకు వీలుండుమో అంతవరకును ప్రజలపరము చేయవలెను”.
ప్రభుత్వమువారిచే నియమింపబడిన అధికార విభజన సంఘము వారు తమ నివేదికయందు ఇట్లు చెప్పియున్నారు:౼ "స్థానిక స్వపరిపాలన గ్రామపంచాయతీలు ప్రతి గ్రామ మందును స్థాపించుట మూలముగా పల్లెటూండ్లలో ప్రారంభించవలెను”. గయా దేశీయమహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీయుత బ్రజకిషోరుప్రసాదుగారు తమ ఉపన్యాసముని ఇట్లు చెప్పియున్నారు:౼ "దేశమును కట్టుబాట్లలోకి తెమ్ము, పల్లెటూండ్లకుపొండు. ఆక్కడి ప్రజలతో పని చేయుడు, ప్రజాసేవ ఎట్లు చేయవలయునో వారికి బోధింపుడు. గ్రామసంఘములకు పునాదిగా స్థాపింపుడు, వాని పైన అఖిల భారత జాతీయ ఉపసంఘము వరకును స్వరాజ్యసౌధమును సోపాన పరంపరగా నిర్మాణముచేయుడు. వీనినన్నిటిని సజీవముగా నుండునట్లును, నిరంతర కృషి చేయుచుండునట్లును, శక్తివంతములుగా నుండునట్లును చేయుడు”. “మొన్నటి దేశీయ మహాజనసభాధ్యక్షులగు శ్రీయుత చిత్తరంజనదాసుగారు ఇట్లు తమ అధ్యక్షోపన్యాసముని సెలవిచ్చియున్నారు:౼ "రాష్ట్రీయ స్వపరిపాలన కంటెను, సామ్రాజ్య బాధ్యతాయుత ప్రభుత్వము కంటెను కూడ పల్లెటూండ్లను కట్టుదిట్టములకు లోనగునట్లుచేసి వానిని స్వపంపాలకములుగా చేయుటయే ఎక్కువ అవసరమగుపని. ఈ