Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

నవీనాంధ్ర కవులు, పండితకవుణ కాల (1845-1895) మెట్టెటులో చెల్లుచుండ, ఇప్పటికే కృష్ణా గోదావరీ విశాఖపట్టణమం డలములలో వ్యాపించుచున్న యాఁగ్ల విద్యాలయములలో కొంచెమింగ్లీషు నభ్యసించి, కొంత తెలుగు, కొంత సంస్కృతము చక్కగ న్చే, ఆంగ్ల, నాగరక సాంప్రకా యములను, ఆంధ్రగీర్వాణ విజ్ఞానమును జతపంచి, యాం గ్లవిద్యాలయములలో పండితులై, ఇవీన భారత భావో స్మేష మెరిఁగిన తెలుగుకవులు, వైదికినియోగు లిరుతెగల వారు (1885 మొదలు 1905) వరకును, ఆంధ్రసార స్వతవివర్లకు లై యశము గాంచిరి. వీరేశలింగము, పసు రాయడు, వేంకటరత్నము, వేంకటరాయశాస్త్రి, వా విలుకొలను సుబ్బారావు, కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు వారొక చ్చెప సంస్కృతనాటకాదులు దెలిగించియు నొక చెంప నాంగ్ల నాటక కావ్యఫణతులు వనుకరించియ, గొన్నియెడల నాంధ్రకవిసింహముల పోకడల వాశ్రయం చియు, తెలుగుకవిత్వమునకు విపుల సంచార మేర్పర చిరి. ఇట్టివిద్యా సాంప్రదాయములేశిల, కవులనేక తావుల నాంగ్ల సం స్కృతిరీతుల నాటకములను, గద్య ప్రబంధ ములను, విమర్శనలను, భాషాంతరీకరణములను జేయుచు వచ్చిరి. 1885-1905 తెలుగు సారస్వతమున, నను కార కయుగము. అందలి ప్రముఖులు భాషాంతరీ కరణమం దను, అనుకరణమందును బ్రజ్ఞావంతులై, తెలుగుబాస కెటులైన నుపకరించు వేడుకతో బాటుపడిరి. భాషాసేవ యే ఈకవుల కావ్య ప్రయత్నముల కారణమును ఫలము ను, వీరు భావోన్మాదులై, జగద్రొష్టులై, రసానుభవ ప్రభావమున కవిత లేర్పరుపలేదు. పాండిత్యమున, విశు జతలో పఁడితకవుల కోడిపోవుదురు. భావసౌష్టవమున కవితో దేశ్యనిర్వహణమున, తరువాతి జాతీయకవుల పోకడలు వీరి కేర్పడలేదు. พ పండిత్కవులును, అనుకరణకవులును, వారి సంస్కార సంబంధమున, ఆంధ్రకవిత్వపు చతుర్ధరంగమునకు జెందిన టులు నన్నయ—యఱ్ఱాప్రగడవరకు మొదటిసీరు పై — ద్దన వరకు రెండవది-- సూరనవరకు మూడవది. - తిరు పతి వెంక టేశ్వరులవరకు నాల్గవదో: ఆవల నవీనాంధ్ర కవితావిర్భావ మహోత్సవరంగమునకు తిరుపతి వెంక టేశ్వరులు సూత్రధారు లైయున్నారు. 1905–1922 వరకున్న కవితాపట వాహకులు చాల వరకు ఆంగ్లవిద్యా సంపూర్ణులే. వీరు ఆంధ్రగీర్వాణ ముల నల్పముగ నభ్యసించి, వెనుకటికంగా భినేతల సహా 2 జా యసంపదలవడసి, ముద్రణాయంత్ర సాహాయ్యమున సుల భమైన నానా కాలములు ఆంధ్ర సారస్వత మనుభవించి, జాతీయభావోద్వేగ పారవశ్యమునను, ప్రజాపోషణలో నానాదెసల విస్తరిల్లు వాఙ్మయనివద్ద మోపాయ ప్రో త్సాహమునను, విదేశసారస్వతాభిజ్ఞతను, వంగ భావో త్సాహ సంపర్కమునను, ఆంధ్రోద్యమోజ్వలిత మాతృ సేవాపరత్వమునను, గ్రావ్యకళాలలిత సాహిత్యరూపా భీమానమునను, సత్కౌక్యవిమర్శనా పఠన సంజాత నూత నాభి ప్రాయ ప్రాబల్యమునను దేశములో తామరతంప నాభిప్రాయ గలై వొడము సాంఘిక రాజకీయవిపర్యయములు వేడి మిచేతను, ప్రకృతి నవలోకించి, భూతజాలముతో నిషా గోష్ఠుల నెరపి, యానందించు కుతూహలమునను బలం తెరంగుల, రసభావ పుష్పాలఁకృతములైన పద్దెగుల వ్రా యుచున్నారు. వీరితో నాంధ్ర వాఙ్మయమున, స్వభావ కవిత్వము ఆరంభమైనది. వీరిలో భానుమూర్తిగారు, మంగిపూడి వేంకటశర్మ, రాయప్రోలు సుబ్బారావు, గుర జాడ అప్పారావు, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంక టేశ్వరావు, సెట్టి లక్ష్మీనరసింహము మున్నగువా రనేకు లంగలగు. వీరు పూర్వులవలే పెద్ద కావ్యములు దలపెట్టక, తమ రసావేశమును, అనుభూతివిషయములను, భావో ప్రయత్నముల విమర్శించుచు, వీరికవితారీతులకును, నానా న్మాదమును చిన్న పద్యావళులలో వెల్లడింతురు. ఇట్టి కాలముల ఆంధ్రసారస్వతిమునకునుగలు సామ్య భేదముల నరయుచు, నధునాతన భాషాప్రపంచసంచలనమున వీరి నియతిస్థానమును జూపుచు, నాంధ్రకవితా ప్రయత్న ముల కవశ్యమార్గముల సూచించుటయే “ఆ నవీనాంధ్ర కవు " లను ఈవ్యాసమాలిక యుద్దేశ్యము, నవీనాంధ్రకవులలో పైజెప్పినవారుకాక, శుద్ధాంధ్ర సంస్కృత పాండిల్య యుగ లిగియు, 1885-1922 వరకును దేశములో వ్యాపించుచున్న భావప్రవాహమును గుర్తె రిగి దేశకాలోచితరీతుల సరసకవితామాధుర్య సౌందర్య మొప్పారు, కవి శేఖరు లనేకులు గలరు. వీరికి నవీవభావ ములు కర్ణాకర్ణికలగుటచే వానిస్వయంవ్యక్తియంతగ దో పెక, నవీనభావబానిసత్వము నంగీకరింపక, లౌకిక పరిజ్ఞా నమును, నవీన భావసూచనలను, తమ పాండితీయంత్ర మున శిక్షించి, అనుభవసారమును సంగ్రహించి, నిరుమ భాషామర్యాదలతో సరసముగ జెప్పు నీతరగతివారిలో తిరుపతి వెంక టేశ్వరు అగ్రగణ్యులు. వీరివెనుక, కాశీ కృష్ణాచారి, పురాణం సూర్యనారాయణ తీర్థులు, మా న్నగువార నేకులు సరసకవితా సామ్రాజ్య సంపన్ను లీ కాల