- 9 రావుసాహేబు యస్. వి. కనకసభాపిళ్లే
- 10 వి.వి.గిరి, బారిష్టరు
- 11 పురుషోత్తముగారు
(త) విద్యాధికులకును యువకులను గ్రంథాల యోద్యమ వ్యాపనమునకై వినియోగించుటకు తగిన ప్రణాళికలను తయారుజేసి రాష్ట్రీయ ప్రభుత్వములకు పంపవలెను. అంతర్జాతీయ గ్రంథాలయసభను భారతవర్షమున జరుపుటకై ఈసభ వారు ఆహ్వానించుచున్నారు.
ప్రభుత్వయివారు కొన్ని గ్రంథాలయములకు వారి ప్రచురములను ఇచ్చుచున్నందులకు ఈ సభవారు వందనము లర్పించుచు, అన్ని గ్రంథాలయములకును ఇప్పించవలెనని కోరుచున్నారు.
గ్రంథ భాండాగారులను తరిబీతు చేయుటకై శిక్షా తరగతులను ఏర్పాటు చేసినందులకు ఈ సభవారు తమసంతుష్టిని గన్పరచుచు, దానిని ఇంకను ఎక్కువగా అభివృద్ధి పరచుటు హిందూ దేశమునందును, బర్మాయందునుగల విశ్వవిద్యాలయము లన్నియు తగిన తరగతులను పెట్టవలెనని ఈ సభ వారు హెచ్చరించుచున్నారు.
అఖిల భారత గ్రంథాలయ సంఘమునకు, భారత గ్రంథాలయ సంఘమును కలిసి పనిచేసిన యెడల, ఉద్యమము ఇంకను ఎక్కువ జయప్రదముగా వ్యాప్తియగును గావున, అట్టి పనికిగాను మార్గముల నన్వేషింపవలెనని యీ సభవారు, ఉభయ సంఘముల కార్య నిర్వాహక వర్గముల వారిని కోరుచున్నారు.
దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారును, వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి గారును, గ్రంథాలయోద్యమమునకు చేయుచున్న సేవను గుర్తించి, వారి కీ సభ వారు ఈక్రింది బిరుదముల నిచ్చి సత్కరించుచున్నారు.
- దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుగారు ౼ జ్ఞానదాత
- వావిళ్ళ వేంకటేశ్వర్లుగారు ౼ ఆంధ్రభాషోద్ధారక
లాహోరు గ్రంథాలయ సేవకులగు ఏ.కే.సిద్ధాంత గారి అకాలమరణమున కీ సభవారు తమ విచారమును దెల్పుచున్నారు.
విందులు
ప్రతినిధులకు 24 వ తేదీని క్రేసెంటు లైబ్రరీవారును, 25 వ తేదీని దివాన్ బహద్దరు, జి. నారాయణస్వామిగారును అల్పా హారవిందును గావించిరి.
రేపల్లెతాలూకా గ్రంథాలయ మహాసభ
పెదపులివర్రు, 15-11-34
14వ నవంబరు మధ్యాహ్నమున 2 గం॥ లకు రేపల్లె తాలూకా ద్వితీయ గ్రంథాలయ మహాసభ ఆంధ్రరాష్ట్రీయ గ్రంథాలయ సంఘ కార్యదర్శిగారగు శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారి యధ్యక్షుత క్రింద పెద వులివరు బాలగంగాధర తిలక్ పుస్తక భాండాగారపు త్రయోదశ వార్షికోత్సవముకొరకు వేయబడిన పందిరిలో జయప్రదముగా జరుప