బడెను. తాలూకాలోని వివిధ గ్రంథాలయ ప్రతినిధులు పలువురు విచ్చేసిరి. రిటైర్డు డిప్యూటీ కలెక్టరు గారగు రావుసాహేబు శ్రీయుత వట్టెంభోగప్పయ్య శాస్త్రిగారిచే మహాసభా కార్యక్రమము ప్రారంభింపబడెను.
వి. యల్. శాస్త్రిగారు, గ్రంథాలయోద్యమమును గూర్చి గంభీరోపన్యాసము నొసంగిరి.
ఏడిద వీరభద్రరావు పంతులు బి.ఏ.,బి. యల్., గారు గ్రంథాలయోద్యమమును గూర్చి విపులముగా ముచ్చటించిరి. బీరువాల లో గ్రంథము లుండిన ఉపయోగము లేదనియు, గ్రంధరాజములను ఉపయోగింపచేయుట స్త్రీ, పురుషులకు ముఖ్యావసరమనియు సెలవిచ్చిరి.
అధ్యక్షోపన్యాసము
తరువాత అధ్యక్షులవా రుపన్యసించుచు గ్రంథాలయోద్యమము భీమవరము తాలూకాలోను, రేపల్లె తాలూకాలోను ఎక్కువగా కొనసాగుట ప్రశంసనీయమని సెలవిచ్చిరి. నవీన కాలములో గ్రంథాలయములు, గ్రంథములు పోగుచేయబడిన దుకాణములు కావనిరి. గ్రంథా లయములోని పుస్తకములు చదువకుండ నుండిన ఇంపీరియల్ బ్యాంకులో డబ్బున్నట్లేయని చెప్పిరి, మరియు, పాశ్చాత్య దేశములలో విజ్ఞానవ్యాప్తి నింకను ఎక్కువ తీవ్రతిగా సాగించుటకై - గ్రంథములను గ్రామోఫోనులయందెక్షించి వినుపించుచున్నారని, గ్రుడ్డివారికిగూడ ఈపద్ధతి మిక్కిలి యుపయోగముగా నున్నదనియు, ఒక గ్రామమందలి జనులందరును గ్రంథాలయము యొక్క ఉపయోగమును పొందుచున్న గాని దేశమునకు మోక్షము లేదనియు జెప్పిరి,
తీర్మానములు
తదుపరి మహాసభలో ఈ దిగువు తీర్మానములు పెట్టబడి యేకగ్రీవముగా నా మోదింపబడెను.
1. ఈ తాలూకాలోని అడవులదీవి గ్రంథాలయ కార్యదర్శియగు కాజ వెంకట నరసింహారావుగారును, శిరిపూడి గ్రంథాలయాధ్యక్షులగు యల్లాప్రగడ జగన్నాథరావుగార్ల నిర్యాణములకు చింతిల్లుదు వారియాత్మలకు శాంతి కలుగుగాక యని యీ సభవారు ప్రార్థించు చున్నారు.
2. ఈ తాలూకాలోని గ్రంథాలయములు లేని గ్రామములవారు తాలూకాగ్రంథాలయ సంఘము వారిసలహాలను తీసికొని వారి గ్రామములలో నూతన గ్రంథాలయములను స్థాపించుటకు హెచ్చరించుట యైనది.
3. మాసవారీ నివేదికలను పంపుటలో అశ్రద్ధ వహించిన గ్రంథాలయములవారు కడుశ్రద్ధతీసికొని ప్రతి నెల 5వ తేదీలోగా నివేదికలను తాలూకా సంఘము వారికి పంపగలందులకు కోరుట యైనది.
4. దసరాపండుగ దినములలో గ్రంథాలయ మహోత్సవమును ప్రతిగ్రంథాలయ నిర్వాహకులును జరిపించగలందులకు కోరుట యైనది.
5. తృతీయ రేపల్లె తాలూకా గ్రంథాలయ వార్షిక మహాసభను ఐలవరం శ్రీ శారదా గ్రంథ నిలయము వారు తమనిలయమున జరిపించుటకు ఆహ్వానించినందున ఆహ్వానమును అంగీకరించుట యైనది.