హిందూయువజన సంఘము, ఏలూరు
29వ వార్షికోత్సవము
ఈగ్రంథాలయముయొక్క వార్షికోత్సవము 21-10-84 తేదీన యం. లక్ష్మీనరసప్పు, యం. ఏ., ట్రేజరరీ డిప్యూటి కలెక్టరు గారి అధ్యక్షత క్రింద మిక్కిలి వైభవముగా జరిగినది. అప్పుడు చదువబడిన గ్రంథాలయము యొక్క నివేదికను ఈ క్రింద వివరించుచున్నాము
సంఘ చరిత్ర
ఈ సంఘము 30 సంవత్సరముల క్రితము ది 23-9-1904 వ తేదీని ఉత్సాహవంతులగు యువకులచే ఏలూరు దక్షిణపు వీధిని స్థాపింపబడెను. ఈ సంస్థానము చేసిన అమృతహస్తుడగు కీ. శే. దుగ్గిరాల సత్యనారాయణమూర్తిగారి సేవ ఈ గ్రంథాలయ జీవనమునకు శ్రీకారమయినది. ఆయస మనకెల్లరకు చిరస్మరణీయుడు. ది 6-11-1918 సంవత్సరము ఈ సంఘము రిజష్టరు చేయబడెను. వితరణశీలుడును, వినయభావుడును, ధర్మకర్త సభాధ్యక్షుడునగు రా॥బ॥ మోతే గంగరాజు జమీందారుడు ఏబది వేల రూప్యములు వెచ్చించి 1929 సం॥న ఈ దివ్యభవనమును దాన మొసంగి తన ఔదార్యమును ప్రకటించెను.
పరీక్షలు:- ఈ సంఘ పక్షమున 6 వ తరగతి మొదలు 11వ తరగతి వరకు విద్య నభ్యసించుచున్న బాల బాలికలకు వ్యాసరచనా
పోటీ పరీక్ష జరుపబడెను. 178 బాలురు 2 బాలికలురు హాజరు అయిరి.
నీతిదాయకమగు నొకకథ - వ్యాయామము - విద్యార్థులు, వారివిధులు - గ్రంథపఠనము, కాలవిభాగము - సంఘసేవ అనువిషయము లందు పరీక్షింపబడినది; పదునొకండు బాలురకున, ఒక బాలికకును బహుమతు లియ్యబడెను.
ఉపన్యాసములు
ఈవత్సరమున 5 ఉపన్యాసము లిప్పించబడినవి.
విజ్ఙప్తి
గ్రంథాలయాభివృద్ధికి ధనము ముఖ్యావసరము. కనీసము ఒక లక్ష రూప్యము లైనను కావలెను. సంఘమునకు, వచ్చు ఆదాయమునకు మించిన వ్యయమగు చున్నది. సంఘమునకు వలయు గ్రంథ రాజములను కొనుటకు ధనము చేకూరుటలేదు. అందుచే విరాళములను ధారాళముగా ప్రసాదింతురని విశ్వసించుచున్నాము.
ఈ సంఘమున 1933 సంవత్సరాంతమునకు 365 సభ్యులు గలరు. 11,986 గ్రంథములు గలవు.
రు.500/ల నిచ్చిన శాశ్వత ధర్మకర్తలు 33రును, అంతకంటే తక్కువ మొత్తము నిచ్చిన వారు 42 రును కలరు. శాశ్వత ధర్మకర్తలు ఇచ్చిన సొమ్ముమీద సాలుగు రు 1,000/లు ఆదా వచ్చుచున్నది.
పత్రికలు:- ఆరు దినపత్రికలు, పండ్రెండు వారపత్రికలు పండ్రెండు మాసపత్రికలును వచ్చుచున్నవి.
రు 204.4–0 విలువగల 367 గ్రంథములు దాతలవలన ఇయ్యబడినవి.
ఆదా:- ఈవత్సరము ఆదా రు5891-11-6 లు. వ్యయము రు 5882 లు.