ధర్మగ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయుటకు గాను జిల్లా, తాలూకా గ్రామగ్రంథాలయ సంఘములను నెలకొల్పవలసినదని యీ సభవారు హెచ్చరించుచున్నారు.
చదువుకొన్న వారికి, చదువురాని వారికి జన సామాన్య మందఱకు విజ్ఞానవ్యాప్తి గలుగుటకును, గ్రంథాలయోద్యమము అందరి ఉద్యమములను నడుపవలసినదని గ్రంథాలయముల పరిపాలకులను హెచ్చరించుచున్నారు.
గ్రంథాలయ సంఘములతో కలిసి పని జేయుటకు, వానిని పరిపాలించుటకును రాష్ట్రీయ సంఘములను నిర్మించి, వానిని అఖిల భారత గ్రంథాలయ సంఘమునకు శాఖలనుగా చేర్చవలసినదని, ఈ సభ వారు హెచ్చరించుచున్నారు.
జనసామాన్యము యొక్క విద్యావ్యాపనమునకై దేశభాషా గ్రంథములను స్వీకరించి వానిని వ్యాపింప జేయుటకుగాను గ్రంథాల విశేష ప్రాముఖ్యము నొసంగ వలెనని యీ సభ వారు తీర్మానించుచున్నారు. యములు హిందూ దేశమంతటను ప్రచురింపబడుచున్న వాఙ్మయము నంతను వివిధ రాష్ట్రీయ గ్రంథాలయములందును, ఇంపీరియలు గ్రథాలయమునందును చేర్చియుండుట అత్యంతావశ్యకము గావున వానికి అన్ని గ్రంథములను ఉచితముగాను, నిర్బంధముగాను తెప్పిం'చుకొను సధికారము నొసుగుట అవసరము.
గత రెండు సంవత్సరములందును గ్రంథాలయవారము జయప్రదముగా నిర్వహించి నందులకు ఈ సభ వారు తమసంతసమును దెల్చుచు, సరస్వతీ పూజలు, సభలు, ప్రదర్శనములు– స్థానిక గ్రంథాలయముల సాహాయ్యర్థము సొమ్మువసూళ్ళు-ఇంకను గ్రంథాలయోద్యమ వ్యాప్తికి కావలసిన ఇతర కార్యక్రమములను నిర్వహించి, ఆ వారమును ప్రతి సంవత్సరమును జరుపవలెనని యీ సభవారు హెచ్చరించుచున్నారు.
మన్నారుగుడి, కొప్పము, ఆలమూరులందు జరుగుచున్న గ్రామ గ్రంథాలయ సేనకు ఈ సభవారు తను యామోదమును దెల్పుచు ఆరీతిగానే దేశము నెల్లెడలను చేయవలెనని ఈ సభవారు కోరుచున్నారు.
(క) పట్టణములందును, పల్లెలయందును, గ్రంథాలయములను వ్యాపింపజేయుటతో మాత్రము సంతుష్టిని జెందక కంటికిచూపుట, చెవికి వినిపించుట మూలమున చదువుకొన్నవారికి, చదువుకోని వారికి అందరికి జ్ఞానవ్యాప్తిని చేయవలెనని ఈసభవారి యభిప్రాయము.
(చ) భారతీయ విజ్ఞానము యొక్క ఘనతకు గూర్చియు, వానియొక్క ఉపయోగమును గూర్బియు ఆంగ్లేయ విద్యాధికులకు తెలియజెప్ప వలెనని ఈసభవారు హెచ్చరించుచున్నారు.
(ట) పై అభిప్రాయములను ఆచరణలో పెట్టుటకై ఈ క్రింది వారిని ఉపసంఘముగా నియమించిరి.
- 1 యస్.యస్. రాజగోపాలం, యం. ఏ.బి.ఎల్.
- 2 దాను త్రివిక్రమరావుగారు, బారిష్టరు, సమావేశకులు
- 3 కుమార మణీంద్ర దేవ రాయి, అధ్యక్షులు
- 4 కే.యం అసదుల్లా
- 5 దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు
- 6 అయ్యంకి 'వేంకటరమణయ్య
- 7 డాక్టరు బి. వి. నారాయణస్వామి, బారిష్టరు
- 8 కే.యల్. నరసింహారావుగారు బి ఏ., బి.యల్.