Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాపింపబడెను. మొట్టమొదట నీపట్టణముననే పునాది వేయబడెను. తిరిగి 1927 సం॥ న అఖిల భారత గ్రంథాలయసభ ఈ పట్టణముననే రెండవమారు సమావేశ మయ్యెను. ఆ సమయముననే నేటివరకునుగూడ జయప్రదముగ పనిచేయుచున్న మదరాసు రాష్ట్రీయ గ్రంథాలయములు సంఘము స్థాపింపబడెను. మహాసభ, చెన్న నగరమున సమావేశమగుట కీది మూడవతూరి. రాష్ట్రీయ గ్రంథాలయ సమితి నేర్పరచుటకు చెన్న రాష్ట్రమే ప్రథమము. రాష్ట్రమునందలి గ్రంథాలయ సంఘములన్నీ యునుగూడ ఈ సమితియందు చేరి బలపరుపవలెను. ఇటీవల రాజకీయ పరిస్థితులవలన, మన రాష్ట్రమున, గ్రంథాలయ వ్యాప్తి తగినంత జరుగుట లేదుగాని ఇటీవల పరిస్థితులు మారుటచే, గ్రంథాలయ స్థాపన లందుగూడకొంత చురుకుగ పనిసాగుచున్నది. అచిరకాలములోనే పాశ్చాత్య దేశములతో సరిసమానముగ మన దేశమునగూడ గొప్ప గ్రంథాలయములు స్థాపించుబడునని నమ్మవచ్చును.

ఆహ్వానసంఘాధ్యక్షులు, గ్రంథాలయోద్యమావశ్యకత నుదాహరించుచు, విద్యాధికులలో వ్యాపించియున్న నిరుద్యోగ సమన్యను, దానిని వారించుటకు గల మార్గములను చర్చించి, విద్యోపార్జనము జీవనోపాయముగ నవలంబించు స్వభావమును తొలగించి, జ్ఞానోపార్జననే పరమావధిగా నొనర్పవలెనని కోరిగి. ఇందుకు గ్రంథాలయోద్యమము చాలవరకు తోడ్పడగలదు. విద్యాలయములందు విద్యోపార్జనము, చాల వ్యయకరముగ నున్నది. అందుచే ప్రజాసామాన్యమున విజ్ఞానవ్యాప్తికి, గ్రంథాలయములు గావింపగల కృషి చాలగలదు. అచిరకాలములోనే మన దేశమున, నూతన ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వము జయప్రదముగ నమలు జరుగవలె ననినచో, అజ్ఞానాంధ కారమున మునిగియున్న ప్రజాసామాన్యమున విజ్ఞానమును వ్యాపింపజేయవలసియున్నది.

ప్రస్తుతము శాసనసభ వారియెదుటనున్న గ్రంథాలయముల చట్టమును గురించి ప్రసంగించుచు, ఆది శాసనమగుటకు కావలసిన సాహాయ్యము నొనర్పవలసినదని ప్రభుత్వము వారిని గోరిరి.

కే.యం.అసదుల్లాగారు సమావేశ ప్రారంభవము గావించుట

కే.యం.అసదుల్లాగారు సమావేశప్రారంభోత్సవము సలుపుచు, ఇట్లు పలికిరి.

గ్రంథాలయ ఉద్యమము వర్తమానకాలమున విద్యాభివృద్ధికిని, ప్రజల విజ్ఞానాభివృద్దికిని ముఖ్యముగ తోడ్పడు చున్నను, ఉద్యమము అనుకొనినంత ప్రాముఖ్యము బడయకుండుట విచారకరము. అచ్చటచ్చట విరివిగా గ్రంథాలయములను స్థాపించి వానిని నిర్వహించుట చేయవలసినపనులలో అవశ్యమైనది. భారత దేశమున విద్య యితర దేశములతో పాటు అభివృద్ధి గాంచియుండక పోయినను ఉన్న విద్యావంతులైనను స్థాపించబడిన గ్రంథాలయములను ఎక్కువ ఉపయోగించుకొనుట లేదని చెప్పవలెను. గ్రంథాలయ ఉద్యమమును ప్రసరింపజేయుట తమ ముఖ్యకార్యమైయున్నను విద్యావంతులైన ప్రజలలో గ్రంథాలయములను వాడుకొనెడి వాంఛను కలిగింపజేయుట ఆవశ్యకము. ఇందుకు