Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ

అఖిలభారత గ్రంథాలయ మహాసభ.

1934 సం॥ డిసెంబరు 24, 25, 26 తేదీలు మద్రాసు

అఖిల భారత గ్రంథాలయమహాసభ 24 తేదీన కాంగ్రెసు భవనమున సమావేశమయ్యెను. పంగ రాష్ట్ర గ్రంథాలయ సంఘాధ్యక్షులగు కుమారమణీంద్రదేవ్ రాయి (ఎం.ఎల్.సి) గారు అధ్యక్షత వహించిరి. భారత దేశము నందలి చాల ప్రాంతములనుండి పెక్కుమంది ప్రతినిధు లరుదెంచిరి.

ఆహ్వాన సంఘాధ్యక్షుని ఉపన్యాసము

ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీయుత కస్తూరి లక్ష్మీనరసింహారావుగారు, ప్రతినిధులకు హృదయపూర్వకమగు స్వాగత మొసగుచు, అఖిలభారత గ్రంథాలయోద్యమమునకును, చెన్న నగరమునకును గల సంబంధముసుదాహరించిరి. మొట్టమొదటి అఖిల భారత గ్రంథాలయ సమావేశ మీపట్టణముననే జరిగెను. అఖిల భారతగ్రంథాలయ సంఘమునకు