బుద్ధియు, నైతిక స్టైర్యమును, కార్యదీక్షయు ఎవరి కుండునో వారే విద్యావంతులు. వివిధజాతి సమ్మేళనమగు హిందూ దేశనిర్మాణమునకు సహాయపడుటయే విద్యాభ్యాస ప్రయోజనమై యుండవలయును. దాని ప్రయోజనము మన జీవితరహస్య మెఱుంగుటయే. విద్యార్థి జీవనమునందు ప్రకృతి, మానవకోటి, దేశము మొదలగు భావములు తరంగితములగు చుండవలయును.
ప్రతిమానవుడును విద్యార్థి. ప్రపంచమేయాతనికి విద్యాలయము. విద్యార్థులకు తామేమిచేయవలయునో నేర్పునది విద్య. స్త్రీలకు గృహ నిర్వహణ కౌశలమును గలిగించునది విద్య. వృత్తిపరులకు తామెట్లు ప్రవర్తింప వలయునో చెప్పునది విద్య. ప్రజలకు తమ ధర్మమును బోధించునది విద్య. వారికి తమ హక్కులను ప్రసాదించునది విద్య. రాజులకు రాజ్యాంగమును జూపించునది విద్య. ఉద్యోగులను తమ కర్తవ్యమునకు బురికొల్పునది విద్య. మతకక్షలను మాన్సునది విద్య. సాంఘిక దురాచారములను బోద్రోలునది విద్య. వేయేల? బాల వరకును బాలికలకును, యువకులకును, యువతీమణులకును, పాలించు రాజునకును రాజోద్యోగులకును పాలింపబడు రైతులకును, తమతమ విధ్యుక్తధర్మమును బోధించి ఉద్ధరించునది, వ్యక్తిత్వమును పెంపొందించునది, మన ప్రవృత్తి నుద్దేకింప జేయునది, స్వయం సహాయమును, ఏకాగ్రతను సమకూర్చునది విద్య. ఇట్టివిద్యను సాధించుటయే మన పరమావధి.
గ్రంథాలయములు, పఠసమందిరములు
మన హైదాబాదునందు మాత్రము సర్కారు ప్రావున నొకగ్రంథాలయము విజ్ఞాననీచికలను వెదజల్లుచున్నది. కాని బహుజన సంఖ్య గల హైద్రాబాదు నగరముననే ఆ గ్రంథాలయము చాలదనిన తప్పుగాదు. ప్రజా పక్షమున అచటచట కొన్ని గ్రంథాలయములు, పఠన మందిరములు స్థాపించబడినవి. కాని అవి పోషించబడనందున నూటికి సం చొ॥ శిథిలమై మగ్గుచున్నవి.. సాగుచున్న గ్రంథాలయముల యందైనను చదువువారి సంఖ్య మిక్కిలితక్కువ. సామాన్య గ్రంథాలయములే శూన్యమైనపుడు సాంకేతిక గ్రంథా లయములుగాని, ప్రత్యేకకళలను బోధించు గ్రంథములు గలిగిన ఆలయములుగాని, సంచార గ్రంథాలయములు గాని ఎట్లుండగలవు? అదేమి దురదృష్టమోగాని యింత వరకు గ్రంథాలయములపై మనప్రభుత్వమువారు తమ కరుణాదృష్టిని బ్రసరింపజేయలేదు. మన సర్కారు వారు ఈ విషయమై బరోడా సంస్థానము వారిపద్ధతి ననుసరించిన చాల ఉపయోముగా నుండును.
నిర్బంధ ప్రారంభవిద్యయు, యువతీ యువకవిద్యయు, గ్రంథాలయములను ఆయా ప్రాంతములయందుగల దేశభాషలలో ఎంతవరకు స్థాపించబడవో గ్రామ జీవనముగల మన ప్రజలలో వారి జీవిత విధానము ననుసరించి వారికవసరమున్న విద్యాప్రణాళికయును, పట్టణ జీవితముగల వారికి వారిస్థితిగతుల కనుకూలించు విధానమును స్త్రీ,పురుషులకు ప్రత్యేకముగా ఎంతవర కవలంబింపబడదో అంతవరకు నిశ్చయమైన అభివృద్ధి అసంభవము. ఇట్టి మార్గములు తతణమే అవలంబించినను ౫ందేశమున విద్య ప్రబలుటకు దాదాపు ౫ం సంవత్సరములు కావలయును. ఈమధ్య నేను శ్రీరాజ రాజ నరేంద్రాంధ్ర భాషా