24
కన్నప్పర్ గ్రంథాలయ అభినందనపత్రము
మదరాసు, 27-12-34
భారతశాసనసభ యెన్నికలయం దఖండ విజయమునందిన శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారిని సన్మానించుటకు గాను రాయపురమునందలి “కన్నప్పర్" ఉచితపఠనాలయము వారు నిన్న సాయంత్రము బహిరంగ సభ నేర్పరచి, సన్మానపత్రము నర్పించి సత్కరించిరి.
గ్రంథాలయసంఘమువారు నాగేశ్వరరావు పంతులుగారికి హృదయ పూర్వకమగు స్వాగత మొసగుచు, ఇటీవల జరిగిన భారతశాసనసభ యెన్నికలయందు వారి కట్టి బ్రహ్మాండమగు విజయ మబ్బినందుల కానందమును వెల్లడించిరి. గ్రంథాలయ భవననిర్మాణ నిధికి పంతులుగా రిదివరకే భూరి విరాళము నొసగియుండిరి.
ఈ గ్రంథ పఠనాలయము 1929 సం॥న ప్రారంభింపబడెను. అల్ఫారంభమయ్యును, గత మూడు వత్సరములలోను, జమీందారుల యొక్కయు, పంతులుగారివంటి ఉదార స్వభావుల యొక్కయు సహాయమువలన, ఇప్పటి యౌన్నత్యమునకు రాగల్గెను. హరిజన బాల వయోజనులకును బాలికలకును, ఈగ్రంథాలయమువారు విద్యాదాన మొనర్చుచున్నారు. ప్రజలు తగినంత విరివిగ విరాళముల నొసగక యుపేక్షించుటచే, గ్రంథాలయమంత సత్వరాభివృద్ధి గాంచజాలక పోయెను. గ్రంథాలయ భవననిర్మాణ మింకను పూర్తి గాలేదు సహజౌదార్య సంపన్నులగు శ్రీ పంతులుగారి దాతృత్వ ఫలితముగ, అచిరకాలములోనే భవననిర్మాణము పూర్తియగునని నమ్ముచున్నాము.
విజ్ఞానము - గ్రంథాలయములు [1]
( శ్రీ పులిజాల వెంకటరంగారావుగారు )
విద్య.
మన లక్ష్యము విద్య. మన యుద్యమ స్వభావము విద్య. అదియే మన గమ్యస్థానము. ఒకరి సుఖదుఃఖములలో పాల్గొని విద్యావిజ్ఞానముల నార్జించుటకు సహాయపడుటయే మనకు గావలసినది. అదియే మనమూలసూత్రము. అదియే మనము తరించుటకు గల సాధనములను సమకూర్చగలదు.
గ్రంథములను జదివిన పండితులుగాని, విశ్వవిద్యాలయము వారిచే పట్టములను బడసినవారుగాని, విద్యావంతులు గాజాలరు. అతిసూక్ష్మములగు ఆధ్యాత్మిక లక్షణములను, ఆపదలలో శాంతమును, నిర్జనస్థలములో లోకవ్యవహారముల యందు నానందమును, నిష్కాపట్యమును, సంపూర్ణమగు నుచి తానుచిత విచక్షణము, న్యాయానుసార
- ↑ నిజాము రాష్ట్ర తృతీయాంధ్ర మహాసభాధ్యక్షులుగ నొసంగిన యుపన్యాసమునుండి.