Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మవరము తాలూకా ద్వితీయగ్రంథాలయ సమావేశము

15-12-84 తేదీ శనివారము నాడు నాగసముద్రమునందు ధర్మవరము బోర్డు

హైస్టూల్ ప్రధానోపాధ్యాయులగు శ్రీయుత పర్వత రాజు సూర్యనారాయణ రావు, B. A., L. T గారి

యాజమాన్యమున జరిగిన పై సమావేశమునందు కావింపబడిన

తీర్మానములు

(1) గ్రామపంచాయతీ గ్రంథాలయాభివృద్ధికై ఇదివరలో నొసంగుచుండిన మేరకే విరివిగా విరాళముల నొసగుటకై తగిన యేర్పాట్లు గావించునట్లు పభుత్వము వారిని ప్రార్థించునదిగా తీర్మానించుటయైనది.

(2) గ్రంథాలయములనురిజస్టరి చేయించుటకై 1860 సంవత్సరము XXI ఇండియా ఆక్టులో విధింపబడియుండు రూ.50/ రుసుమును తగ్గించుటకై తగిన సవరణల నవపాదించునదిగా భారత శాసనసభకు మన రాయల సీమ ప్రతినిధిగా నెన్నుకొనబడి యుండు శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగారిని కోరునదిగా తీర్మానించుట యైనది.

(8) ప్రతిగ్రామ పంచాయతీ బోర్డు వారును తమస్వాధీనమున నుండు గ్రంథాలయమునకు తమ గ్రామపాఠశాలలో పాటుపడు చుండు ఉపాధ్యాయమహాశయుని గ్రంథాలయభాండాగారికునిగా ఉపయోగించుకొనుట చాలా శ్రేయస్కరమని ఈసభవారు సూచించు చున్నారు.

(4) ధర్మవరముతాలూకా గ్రంథాలయ సంఘమువారు గ్రామసీమలందు విజ్ఞాన వ్యావజ్ఞానవ్యానమునకై పూనుకొన్న సంచార గ్రంథాల యోద్యమమును జయప్రదముగా కొనసాగించుటకు ధర్మవరము తాలూకాబోర్డు వారు మంజూరు చేసియుండిన రు 100/ విరాళమును త్వరలో శాంక్ష చేసి యిప్పించునట్లు అనంతపురము జిల్లా బోర్డు వారిని ప్రార్థించునదిగా తీర్మానించడమైనది.

(5) ధర్మవరమునందు శ్రీ క్రియాశక్తి ఒడయ౯ గ్రంథాలయమునకు సుందరమందిరము నిర్మించి శాశ్వతకీర్తి నార్జించి, మన మండలమున నితరులకు మార్గదర్శకులైన శ్రీయుత బండ్లపల్లి లక్ష్మీనారాయణ శ్రేష్ఠిగారికి ఈసభవారు తమహృదయపూర్వక అభివందనములు నేర్పించునట్లు తీర్మానించడమైనది.

(6) ధర్మవరము తాలూకా గ్రథాలయ సంఘమునకు ఈ క్రింద కనపఱచిన వారలను అధికారులనుగా నెన్నుకొనునట్లు తీర్మానించడమైనది. గారి (7) గ్రంథాలయోద్యమమున పాటుపడుచుండిన శ్రీయుత బెల్గాం రామదాసునాయని ఆ కాలమరణమునకై ఈ సభవారు తమహృదయ పూర్వక సానుభూతిని వెల్లడించునట్లు తీర్మానించడమైనది.


అధ్యక్షుడు

హట్టి శంకరరావుగారు

ఉపాధ్యక్షుడు

బండ్లపల్లి లక్ష్మీనారాయణ శ్రేష్ఠిగారు