Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్యదర్శి

రామానందుల వెంకటేశమయ్యగారు

సహాయ కార్యదర్శులు

తాలూకాలోని ప్రాథమిక పాఠశాలో యూపాధ్యాయ కేంద్ర సంఘ కార్యదర్శులు, ఇతర కార్యనిర్వాహక వర్గము

1 కోటంపల్లి గోవింద రెడ్డి గారు
2. యాదాళం వెంకప్ప శెట్టిగారు
3 పన్ను రంగప్పగారు
4 న్యామద్దుల పంచాంగం అదెప్పగారు
5.పేరూరు రామకృష్ణ రావుగారు
6 ఈడిగ మెకటప్పగారు ((కనగానపల్లె)
7 గోనుగుంట్ల లింగా రెడ్డిగారు (మాల్యవంతము)
8 చిందులూరు రామచంద్రయ్యగారు
9 యర్రగుంట హనుమంత రావు గారు


సంచార గ్రంథాలయములు — వయోజనవిద్యాసేవ

కుమారగురుకులము - మన్నారుగుడి

(ఏప్రిల్ - సెప్టెంబరు 1934 - ఈ అర్ధసంవత్సరములో నిర్వహింపబడిన కార్యక్రమము)

సంచార గ్రంథాలయము

సంచార గ్రంథాలయ సేవ 1931 వ సంవత్సరము అక్టోబరు లో ప్రారంభింపబడి 1931 సెప్టెంబరు తుదివరకు గ్రామములలో మూడు సంవత్సరములు కార్యక్రమమున నిర్వహించెను.

ఈమూడు సంవత్సరములలో సాంఘికాభ్యుదయమునకు వహించిన శ్రద్ధతో బాటు వ్యక్తిగతముగ కూడ పఠనాదికములందు ప్రత్యేకశ్రద్ధ దీసికొనబడినది. ఇట్టి శ్రద్ధ మమ్ములను వారి యావశ్యకతలను గుర్తెరుంగ జేసినది. 112 గ్రామములలో నున్న 1523 మంది ప్రజలు పుస్తకములను పఠించిరనియు, కడచిన యారు నెలలలో మొత్తము 9157 పుస్తకములు పఠింపబడినవని గుర్తించుట సంతృప్తి కరమైన విషయము.

సుమారు 500 చదరపు మైళ్లు గల యేడు తాలూకాలలో అనేక గ్రామములలో నీ సంచారగ్రంథాలయ సేవ జరిగెను. నున్నవి.

గ్రామసంఘములు

(అనగా 16 గురు సభ్యులకు తక్కువగాని సంఘములు) 1931 వసంవత్సరములో 12 గ్రామ సంఘములును, 1932 లో 100 ను 1933 లో 118 యును, నున్నవి. ఈ సంఖ్యయందు పరిశోధనజేయు 15 సంఘములు జేరలేదు పరిశోధన జేయుసంస్థలు నాలుగు తప్ప తక్కినవి విలయము చేయబడినవి. ఇపుడు 137 సంఘములను గలిగి యున్నాము. మొత్తము 141 సంఘములలోను 112 సంఘములు చక్కగా పనిజేసినవి.

ప్రతి సందర్శనమునకును పాఠకులలో ప్రతివారును ఒక్క పుస్తకమునైనను నుపయోగించినచో నా సంఘము బాగుగ పనిచేయు చున్నదని లెక్క వేయవచ్చును. ఈ విధముగ పని చేయుచున్నవి 112 సంఘము లున్నవి. అనగా మొత్తము 141 లో నూటికి 80 వంతు. ఈ విషయములన్నియు పరికించినచో మా సేవ జనాదరణీయమై యున్నదని యొప్పుకొందురు.