Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫలహారము

సభానంతరము ఆనరబిల్ దివాను బహద్దర్ గోపతి నారాయణస్వామిగారు ప్రతి నిధులకు విందును గావించిరి.

రాబోవు సభ

రాబోవుసభను నిత్తూరుజిల్లా నారాయణ వరం హనుమద్గ్రంధాలయ కార్యదర్శియగు సి.వి.రంగం శ్రేష్ఠి గారు తమగ్రామమున జరుగుటకై ఆహ్వానించిరి.

అంతటితో సభ ముగిసినది.

బాలగంగాధరతిలక్ పుస్తకాలయము, పెదపులివర్రు,

రేపల్లె తాలూకా

ఈ గ్రంథాలయముయొక్క త్రయోదశవార్షికోత్సవము 14-11.34 తేదీనాడు శ్రీ చెరుకు వాడ వేంకటనరసింహంగారి అధ్యక్షత కింద జరిగినది. అప్పుడు నివేదింపబడిన ఈ సంగతులకు ప్రచురించుచున్నాము.

ఇది పదమూడు సంవత్సరముల క్రిత మీ గ్రామమందు స్థాపింపబడినది. రూ.130 లు విలువగల గ్రంథములను, రూ.20 లు చేయు బీరువాను బ్రహ్మశ్రీ పండిత కాశీనాథుని రాజలింగశాస్త్రిగారిచ్చిరి.

గ్రంథాల యోద్యమముయొక్క ప్రాశస్త్యమును గమనించి లోకోపకార మొనర్ప స్థితప్రజ్ఞులై కొవ్వూరు నందుగల ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమునకు రూ.12,000/-లు విరాళమొసగి వారు రచించిన గ్రంథములను మన గ్రంథాలయమునకు సహితము పంపుచు అభిమానమును వెల్లడించు మహానుభావులు శ్రీ “వల్లూరి సూర్యనారాయణ రావు పంతులు గారును" పూజనీయులు.

సం॥రములో 18 పాలక వర్గసమావేశములును, 1 సన్మాన సంఘ సమావేశమును జరిపి, 38 హంశములపై చర్చించి తీరుమానించినారు.

స్త్రీ విద్యావ్యాప్తికిగాను ప్రత్యేక నౌకరును నియమించి, నియమానుసారము పుస్తకముల నిండ్లకందించి స్త్రీలయందు విజ్ఞానమును వృద్ధి చేయుచున్నారు.

1400 లకు పైగా గ్రంథములు 5 బీరువాలు కలిగి 10 పత్రికలు తెప్పించుచు పాఠకులు దినదినాభివృద్ధి యగుచున్నారు. ఈ గ్రంథాలయమునకు 10 పత్రికలు వచ్చుచున్నవి. ఈ సంవత్సరము దాతలు 389 గ్రంథములను దయతో నొసంగిరి.

ఈ గ్రంథాలయమునకు 1921 సం॥ జూలైలో కాలువ లంకలపాటలకు గ్రామములోనున్న భిన్న భావములను బహుఓర్పుతో నేకీభవింపజేసి ఆ పాటలమీద వచ్చిన ఆదాయమును ఖర్చులతో రు.966-0-0 వసూలు పరచి అప్పుడు ఉన్న జాతీయ విద్యాలయమునకు గ్రంథాలయమునకు జూయంటుగానున్న ఖాతాకు శ్రీ కనగాల కృష్ణయ్య చౌదరిగారు ఇప్పించిరి. 1934 సం॥ రమునకు రు 100 లు మొత్తము రు 200-0-0 లు వడ్డీతో సహా.

ది 8-10-84 భట్టిప్రోలు వసూలు(దసరాభిక్షులు)

శ్రీయుత

భట్టిప్రోలు చంద్ర శేఖర రావుగారు రు 0- అ 8
మద్దుల గిరిరావుగారు రు 1-అ 0
పాలకుర్తి సీతారామయ్యగారు రు 0-అ 8
మద్దుల నరసింహంగారు రు 0-అ 8