౧౧.1860 సం॥ నెం 21 రు చట్ట ప్రకారము రిజస్టరు చేయుట కివ్వవలసిన రుసుమును గ్రంథాలయములకును పఠనమందిరములకును లేకుండ ఉచితముగా రిజిస్టరీ చేయించునటుల చట్టమును సవరించి వేయవలెనని ప్రభుత్వము వారిని ఈసభ వారు కోరుచున్నారు.
అధ్యక్షులు
౧౨. ప్రభుత్వము వారు ప్రొవిన్షియలు ఫండునుండి వివిధ గ్రంథాలయముల కోసంగు గ్రాంటు సందర్భములో గ్రంథాలయములు రిజిష్టరు చేయబడవలయునను నిర్బంధమును తొలగించవలసినదిగా ప్రభుత్వము వారి నీ సభవారు కోరుచున్నారు,
అధ్యక్షులు
౧౩. ముద్రాలయములలో ముద్రింపబడు గ్రంథములలో మూడేసిప్రతులు చొప్పున గైకొనుచు వానిని తమకు తోచినరీతిని పంపుచున్న దొరతనమువారిని నాల్గవ ప్రతికూడ గైకొనుచు నయ్యది ఆంధ్రుల కుపయోగపడునట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయమునకో ఆంధ్రసాహిత్య పరిషద్గ్రంథాలయమునకో పంపుచుండగలందులకు తగిన శాసనముల నిర్మించుటకై విద్యాశాఖకు సంబంధించిన శాసనసభ్యులను ఈ సభవారు కోరుచున్నారు.
అధ్యక్షులు
౧౪. ఆంధ్ర భాండారి తరిబీదు శిక్షణతరగతులను వెంటనే ప్రారంభించుట అవసరమని ఈ సభ వారు ఆంధ్రవిశ్వ కళాపరిషత్తువారిని కోరుచున్నారు.
అధ్యక్షులు
౧౫. ప్రభుత్వవిరాళములకై గ్రంథాలయములనుండి రాబడుదరఖాస్తులు అట్టి గ్రం థాలయము లుండు ప్రదేశమునకు గల మునీసిపాలిటీ లేక జిల్లాబోర్డుల ద్వారానే పంపబడవలయునను నియమమును తొలగించవలయునని ఈ సభవారు మద్రాసు ప్రభుత్వము వారిని కోరుచున్నారు.
౧౬. గ్రంథాలయముల పోషణకొరకు Assessed waste lands శిస్తు కట్టు గయారు భూములను గ్రంథాలయములకు శాంక్షన్ చేయుట కొరకు జిల్లా కలెక్టర కుత్తర్వు లిప్పించవలసినదిగా ఈసభ వారు ప్రభుత్వము వారిని కోరుచున్నారు.
- ఉ: దశిక సుబ్బయ్యగారు
- ఆ : ఏలూరుపాటి రామభద్ర చయనులుగారు
౧౭. ఎ. ఆంధ్ర రాష్ట్రములోని ముఖ్యప్రాంతములగు జయపురం, పర్లాకిమిడి, బరంపురం మొదలగు ముఖ్యాంధ్ర ప్రదేశమును నూతన ఒరిస్సా రాష్ట్రములో చేర్చుచు అంధ్రాభ్యుదయమునకు ఆంధ్ర విజ్ఞానాభివృద్ధికి తీరని నష్టము కలిగించిన జాయంటు పార్లమెంటరీ కమిటీవారి సలహాను తీవ్రముగా ఖండించుచు అట్టిసలహాను ఉపసంహరించుకొను నటుల ఆంధ్రు లెల్లరును ప్రచండాందోళన జరుపవలెనని ఈ సభవారు ఆంధ్రదేశీయులను కోరుచున్నారు.
బి. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర మవసరమని యీ సభ వారభిప్రాయపడుచు రాష్ట్రనిర్మాణమునకై తగువిధములు పాటుపడవలెనని దేశీయు లెల్లరను నీ సభవారు గోరుచున్నారు.
- ఉ: వావిలాల గోపాలకృష్ణయ్య గారు
- ఆ: మల్లెల శ్రీరామమూర్తి గారు