Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లతో ఉత్తరప్రత్యుత్తరములను జరుపవలెను. తఱుచుగా మండల తాలూకాగ్రంథాలయ సభలను జరుపుచుండవలెను. అటుల చేసినచో ఉద్యమము సరిగా నుండును. ఇందులకు నివుణులు కావలెను. వారు తమ ప్రాంతములలో సమగ్రాభివృద్ధికొఱకు పనిచేయవలెను. కావున గ్రామపునర్నిర్మాణము గూడ గ్రంథాలయోద్యమమున ఒక భాగముగా నుండవలెను. అమెరికావారీ పద్ధతిని అనుసరించుట వలన మంచి ఫలితము కలిగినది. కావున మన దేశములో గూడ ప్రతి గ్రామమువారు తమ ప్రాంతములలో సరిగా పని చేయు నెడల మన ఆశయమీడేర గలదు. ప్రజా ప్రభుత్వాశయములను వృద్ధినొందించుటయును లాభకరములగు పనులను చేయించుటయును గ్రంథాలయ సంఘముల వారి సేవకు ముఖ్యలక్షణములు. మానవ సంఘాభివృద్ధికి సంబంధించిన తక్కిన అన్ని ఉద్యమములతో కలసి గ్రంథా లయముల వారు గూడ ఉదార భావముతో సాంఘికాభివృద్ధికి పనిచేయవలెను. ప్రజలలో విద్యయును, పాండిత్యమును, వినోదమును కలుగజేయవలెను. ఇందులకు ప్రజలు ప్రభుత్వము గూడ ఉద్యమమునకు తోడ్పడ వలెను. ఇది జాతి కంతకును అధికమగు లాభమును కలుగజేయునట్టిది. కాని వ్యక్తి లాభమును కలుగ జేయునది కాదు. జాతివిజ్ఞానము, ప్రజల సద్వర్తనము, సుఖజీవనము వీనిని బట్టియే జాతి అధిక్యత యేర్పడును. ప్రాచీనులగు ఆంధ్రులు జ్ఞాన విజ్ఞాన సంపన్నులై యుండి మనకు విజ్ఞాన మొసంగినను ఇప్పుడు ఆంధ్రులు దానిని సరిగా వినియోగించుకొన లేదను, నపఖ్యాతికి మనము పాల్పడ కూడదు. అనంతరము ఈ దిగువ తీర్మానములు చేయడినని.

తీర్మానములు

౧. ఆంధ్రగ్రంథాలయసభను ముందు సంవత్సరము చిత్తూరునకు ఆహ్వానించు చున్నారు.

ఉ: సి. వి. రంగం శ్రేష్ఠి గారు
ఆ : యస్. యస్. రాజగోపాల్

౨. దేశ గ్రంథాలయ సంఘమును ఆంధ్ర దేశనందలి గ్రంథాలయములకు ప్రాతినిధ్య సంస్థచేసి గ్రంథాలయోద్యమమును దేశమునం దంతటను వ్యాపింపచేయు కార్యనిర్వాహక వర్గము నొకదాని నేర్పరుపవలెనని యీ సభవారు తీర్మానించుచున్నారు.

ఉ: యం. రామారావుగారు
ఆ: నరహరి శెట్టి ఆంజ నేయులుగారు

౩. ఆంధ్ర దేశముననున్న గ్రంథాలయముల యొక్క పట్టికను త్వరలో ప్రకటించుట మిక్కిలి అవసరముగాన ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమువారీ కార్యమును త్వరలో నెరవేర్పవలెనని యీ సభవారు తీర్మానించుచున్నారు.

ఉ: వావిలాల గోపాలకృష్ణయ్యగారు
ఆ: పుణ్యమూర్తుల రాజశేఖరంగారు

౪. ఆంధ్రదేశమున జిల్లా తాలూకా గ్రంథాలయసంఘము నెలకొల్పుటకై యువ