ను కలుగ జేయుట విద్యాశాఖ వారి కర్తవ్యమై యున్నది. ప్రస్తుతము దొరతనము వారిటుల చేయుటలేదు. కావున ఆంధ్ర దేశముయొక్క ఆవశ్యకమును బట్టి గ్రంథాలయములను పోషించుటకు కావలసినంత ధనమును దొరతనము వారిచ్చునట్లు గ్రంథాల యోద్యమమువారును శాసనసభ్యులును, సంఘ సంస్కర్తలు గూడ దొరతనము వారిని నిర్బంధింపవలెను. ఇప్పుడు చెన్న రాష్ట్రము మొత్తముమీద కొన్ని వేలు మాత్రమే యిచ్చుచున్నారు. కొన్ని లక్షలు కావలెను. వారటులు చేయువరకును ఎక్కువ పట్టుదలతో దేశసేవకు నిర్భయముగా తీవ్రమగు ఆందోళన జరుపుచునే యుండవలెను. శాసనసభ్యులు గ్రంథాలయ ఉద్దేశములను అవకాశములను తెలిసికొనిన తర్వాతనే తగిన చిత్తు చట్టములను సిద్ధపఱుపవలెను. విదేశములలో చేయబడుచున్న చట్టములకు అంధప్రాయముగా అనుసరించుటవలన మన కెట్టి లాభము కలుగదు. ప్రభుత్వము వారు ధన మొసంగ నియెడల చట్టము చేయుటవలన ప్రయోజనము లేదు. కొన్ని సం॥లలో గ్రామమునకు కనీస మొక గ్రంథాలయమైన నేర్పడునటుల ప్రజానాయకులను ప్రభుత్వమును ప్రోత్సాహపఱచు నిమిత్తము ఉద్యమమున పనిచేయు నాయకులు దీక్షగా పనిచేసెదరా? ఇది అసాధ్యముని మన నాయకులు తోసి పుచ్చెదరేమో, వారటుల చేసినచో ప్రజల లాభమును తృణీకరించినవారే యగుదురు. పౌర ధర్మములను సరిగా ప్రజలందరు నెరవేర్చవలెననినను దేశమునకు కావలసిన విషయములను బలవఱుపవ లెననినను ప్రజలు విజ్ఞాన వంతులుగా నుండవలెను. లేనిచో జాతీయ పునర్నిర్మాణము కొనసాగదు. కావున అందులకు కావలసిన చట్టములు చేయబడుట, గ్రామములలో నున్న ప్రాథమిక పాఠశాలలు గ్రంథాలయములుగా చేయబడుట, గ్రంథాలయముల నిమిత్తము కావలసిన ధనమును దొరతనము వారొసంగుట, మన దేశమునందలి స్త్రీలను పురుషులను గ్రంథాలయోద్యమము నందు తమ బాధ్యతను గుర్తించి ఎక్కువ శశ్రద్ధతో పనిచేయుట మున్నగు విషయములను గూర్చి మనమిపుడు దీక్షగా పనిచేయవలెను. దొరతనమువారు తమవిధులను నిర్వర్తించువరకు మనము మిన్నకుండవలెననినా ఉద్దేశము కాదు. ఈలోగా మనము చేయవలసినపని హెచ్చుగానున్నది. ఇప్పుడు మండల సంఘములు, తాలూకా సంఘములు, చాల చోట్ల నున్నవి. కొన్ని చోట్ల పనిచేయుచున్నవి. మరికొన్నిచోట్ల పనిచేయుటలేదు. కొన్ని మండలములలో వందలకొలది గ్రంధాలయములున్నవి. మరికొన్నిటిలో చాల తక్కువగా నున్నవి. కొన్నిటికి ధనమెక్కువగానున్నది. మరికొన్ని నిరాధార స్థితియందున్నవి. అనుభవజ్ఞులును, నిపుణులగు వారు కొన్నింటిని పరిపాలించు చున్నారు. కాని అధిక సంఖ్యాకములగు సంఘముల పరిపాలన సరిగా జరుగుట లేదు. కావున అభ్యాసమును బడసిన గ్రంథాలయాధికారులను నియమింపవలసి యున్నది. రాష్ట్రీయ సంఘమువారి సూచనల ప్రకారము రాష్ట్రములోని సంఘము లన్నియు సహకార సామరస్య భావములతో కలిసి పనిచేసిననే గాని సరియైన ఫలితము కలుగదు. కావున ఒక సం॥ పాటు చేయవలసిన పనిని మన మిపుడు నిర్ణయించి దానిని దీక్షగా నిర్వహింపవలెను. అప్పుడప్పుడు గ్రంథాలయములను పరీక్షించుచుండవలెను. నాయకు
పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/17
స్వరూపం