డియే మన దేశములో గ్రంథాలయోద్యమము ప్ర్రారంభమైన దనియు, అస్వతంత్రమగు దేశమునందు ఇట్టియుద్యమములు కొనసాగుట కనేకములైన అంతరాయము లుండుననియు, ఇట్టియుద్యమములు స్వప్రయత్నముపై గాని, లేక పరావలంబనము వలన గాని ఈ రెండు మార్గములలోనే దేనియొక దానివలన జరుగవలెననియు, మన పాలకుల యొక్క సాయమును మన మాశింతుమేని వారు నిర్ణయించు విధినిషేధముల కన్నిటికిని లోబడి వర్తింపవలెననియు వివిధ రాష్ట్రములందును ప్రభుత్వము వారు వేర్వేరు శాసనములను శ్రావించి యున్నారనియు, ప్రభుత్వసాహాయ్యమును బొందుచు, అట్టి శాసనముల సతిక్రమించినచో ఆసంస్థ అక్రమసంస్థ యగుననియు, ఆంధ్ర దేశములో ప్రభుత్వమువారి ఆదరణ లేకయే, ప్రజలు, యువకులును ఈ యుద్యమము నింతవరకు పోషించుచు, తమ వ్యక్తిత్వమును నిలుపుకొనుచున్నారనియు, గ్రంథాలయ స్థాపనయనగా గొప్ప కట్టడములు, అద్దముల బీరువాలు, వేలకొలది పుస్తకములను సేకరించుటయేయని తలంపరాదనియు, ఉన్న గ్రంథములు కొలదియైనను అయ్యది ప్రజలవిద్యావ్యాప్తికి, విజ్ఞానోదయమునకు తోడ్పడునట్లుగా చూడవలె ననియు, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, అజ్ఞానమే చీకటి యని పెద్దలు చెప్పి రనియు, కావున అజ్ఞానాంధ కారమును పోద్రోలవలె ననియు, లక్ష్యము సమున్నత మైయుండుటవసర మనియు, ఆంధ్ర దేశములో గ్రంథాలయోద్యమమున కవకాశమును, అ భ్యుదయమును కలదనియు, ఐనను ఈ యుద్యమమును ఏకముఖముగా శ్రమమైన పద్ధతులపై నడుపవలసిన భారము ఉద్యమ నిర్వాహకులపై కల దనియు రాజకీయము లతో నీ యుద్యమమున కెట్టిసంబంధమును లేదనియు పల్కిరి. వివిధ ప్రాంత ములనుండి సభ కరుదెంచిన ప్రతినిధులకు మనఃపూర్వక స్వాగతమును సమర్పించిరి.
దాసు త్రివిక్రమరావుగారి అధ్యక్షకోపన్యాసము.
పిమ్మట శ్రీదాసు త్రివిక్రమరావుగారు అధ్యక్షత వహింపవలెనని సి.వి.రంగం శెట్టిగారు, దశిక సుబ్బయ్యగారు గుబిలు సుందరేశనుగారు ఉపపాదించిన పిమ్మట త్రివిక్రమరావుగారు ఈ క్రింది ఉపన్యాస మిచ్చిరి:--
గ్రంథాలయోద్యమమునకు సేవచేయుట యందాసక్తుడనై యున్న నన్ను మీరీ సభ కు అధ్యక్షునిగా నియమించినందులకు నేను మిక్కిలి సంతసించుచున్నాను. 'ఈ ఆంధ్ర దేశ గ్రంథాలయసంఘ మేర్పడినపిమ్మట నీ 20 యేండ్లలోను ఆంధ్ర దేశ వాఙ్మయవిజ్ఞాన చరిత్రలో చాలముఖ్య విషయములు జరిగినవి. గ్రంథాలయముల ద్వారా సమస్త ప్రజలలో ను విజ్ఞానాభివృద్ధిని కలిగించుటకు యత్నింప బడెను. ఇది ఎంతవరకు సఫలమైనదో చరిత్ర కారులే వివరింప నర్హులు.
తెలుగుభాషను మాట్లాడునట్టి రెండుకోట్ల మంది ప్రజలలోను 1920 నుండి 100 కి 100 వంతున చదువుకొనిన వారిసంఖ్య అధికమగు టయేగాక దేశాభివృద్ధికి సహాయకములగు నన్ని ఉద్యమములతోను ప్రజలకు సంబంధము