Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థాపించెను. కాని స్కాట్లండు దేశమున నీయుద్యమ మందిన వ్యాప్తి చాల ఆశ్చర్యకరము. అచట ప్రతీగ్రామమునందును, బట్టణ మందును గూడ అనేక గ్రంథాలయములు గలవు.

"మన దేశమున, అఖిల భారత గ్రంథాలయ సంఘమును స్థాపించుటలో మనవారు చాల దూరదృష్టిని గన్పరచిరి. ఇందువలన నిక నీ దేశమందలి ప్రాంతములలో గ్రంథాలయములను ఉపన్యాసములను, ప్రదర్శనములను నేర్పరుచుటకును ఏకముఖమున పనిచేయగలవు. ఈ యుద్యమ విజయమునకు ప్రజల యుత్సాహము కార్యదీక్ష ధనికులఔదార్యము ప్రభుత్వమువారి చట్టసహాయము అన్నియు కూడా అవసరము. ఈ యుద్యమమును వ్యాపింపచేయు కార్యము, ఉత్సాహపరులును, సమర్థులును అగు యువకుల కప్పగింపవలెను. గ్రంథాలయములను ప్రజాసామాన్య విద్యాసంస్థలుగ పరిగణించి వానిని నిర్వహించు భారమును స్థానిక సంస్థలును, పురపాలక సంఘములును రాష్ట్రీయ ప్రభుత్వములును వహింపవలెను. మదరాసు పబ్లికు లైబ్రరీల చట్టమువంటి శాసన నిర్మాణ మందుకు చాల తోడ్పడగలదు. ఆ చట్టసహాయమున జిల్లా గ్రంథాలయ సంఘములును, తాలూకా గ్రంథాలయ సంఘములును ఏర్పరుపబడును. ఒక్కొక తాలూకా యందలి ప్రాతము నందలి గ్రామము లన్నిటి యందును, స్థానిక గ్రంథాలయములు గాని సంచార గ్రంథాలయములుగాని ఏర్పరుచుటకును ఉపన్యాసములను, ప్రదర్శనములను నేర్పరచుటకును తాలూకా సంఘములును చాలావరకు కార్యభారము వహింపగలవు. చెన్నపట్నము వంటి పెద్ద నగరములలో, ప్రతి డివిజనునకును అధమమొక్క గ్రంథాలయ మైన నుండవలెను. ప్రజలచటకు వచ్చి వార్తా పత్రికల ప్రకటించుటకును, స్వల్ప మొత్తమును ధరావతు చేసి, గ్రంథముల నేరువు తీసుకొని వెళ్లి చదువుకొనుటకును ఏర్పాట్లు జరగవలెను. ఈ యుద్యమమున ఔదార్యవంతులెల్లరును చాల తోడ్పడగలరు. అమెరికా దేశమున కార్నిజీ వంటి యుదారులీ యుద్యమమున కొనర్చిన సహాయము జగత్ప్రసిద్ధము. మన దేశమునకుడా ధనికుల కౌదార్యమీ యుద్యమమునకు చేయూత యగును గాక! విశ్వవిద్యాలయములు గూడా గ్రంథాలయ నిర్వహణమందు శిక్షణము నేర్పరిచి, చాలావరకు తోడ్పడకలవు. మన రాష్ట్రమున ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమీ యుద్యమమున కమూల్యమగు సహాయమొనర్చుచున్నది. ఆసంఘము దినదిన ప్రవర్ధమానమై ఆంధ్రదేశమున విజ్ఞానకాంతులు వెదజల్లు గాక".

రెండవదినము

25 వ తేదీ మధ్యాహ్నమున తిరిగి సభ సమావేశ మయ్యెను. ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీ దేశోద్ధారక నాగేశ్వర రావు పంతులు గారు ఈ క్రిందిరీతిని ఉపన్యాసమిచ్చిరి:-

ఆహ్వాన సంఘాధ్యక్షులగు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి ఉపన్యాససారము.

కడచిన దినమందు అఖిలభారత గ్రంథాలయ మహాసభ జరిగియుండెననియు, అందు ప్రసిద్ధులైనవార లనేకులు పాల్గొనియుండి రనియు, నాడు ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు పల్లెటూరి ప్రజలనేకులు ప్రతినిధులుగా నరుదెంచి రనియు, 1885 సం॥ నుం