Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

69

వారికే 5 తూర్పుగోదావరి మండల గ్రంథాలయసభ. EF అరము కాక నంటే యీనూతన సాధనములు సంపాదించవలెను. పుస్తకములు యెక్కువగా భాండాగారములో నుంచిన మాత్రమున అందఱు చదు పుచున్నారన్న మాటలో నాకు విశ్వాసములేదు. బీరువాలో పుస్తక ములు చూడరు. అక్షరాస్యులే గ్రామములలో తక్కువ, కొంచెము చదువగల్గినవారై నను పుస్తకము చదువుటకు అశ్రద్ధ. అర్థము పోవచ్చును విసుగుదల. కలెక్టరు ప్రొఫెసరు రామమూర్తిగారు చెప్పి నట్లు అందరను అక్షరాస్యులనుగా తయారు చేయుట సాధ్యముకాదు జ్ఞానసంపాదనకు అక్షరాస్యులు కానక్కరలేదు. అందుకనే డాక్టరు అనిబి సెంటమ్మ గారు ఏమని చెప్పినా రనగా- హిందూ దేశములోని 7 రైతు వ్రాయను చదువను నేర్వనప్పటికీని సాంప్రదాయముగా వచ్చు చున్నట్టి విజ్ఞానము ఆతనికి గలదు. గ్రంథాలయములు చదువుకున్న పూర్వకాలములో ఉపయోగించెడివి. అక్షరములు రానివారికి తెలివి తేట లెట్లు గలిగినవి? దేవాలయములోని బొమ్మలు, అజంతా గుహలు మున్నగువానిలోని రంగుల చిత్రములు, యీ విధమైన దాని వల్ల వారికి కథలు తెలిసేవి. చరిత్ర బోధపడేది. ధర్మ మేమియో న్యాయమేమియో గోచరించెడిది. ఇంకను వీధిభాగవతములు, వీధినా టకములు, తోలుబొమ్మలాటలు యివియన్నియు ప్రజలకు జ్ఞానమును కల్పించెడివిగావా? ఇవన్నియు జాతీయవికాసమునకు మన పూర్వులు పెట్టిన సాధనములు. నేడో నవనాగరకత ప్రబలమై విద్యుచ్ఛక్తి రేడి యోల ప్రభావ మంతకంత కభివృద్ధి చెందుచుండుట చేత నూతన సాధన ములు కల్పింపబడుచున్నవి. అట్టి నూతనపరికరములను గూడ మనము సమకూర్చుకొనుటకు ప్రయత్నించినచో గ్రామములో నూతనవి కాన మును పుట్టి తుము. మరియు, యిప్పుడు కో ఆపరేటివ్ సంఘములలో (కామ గుడ్ ఫుడు) సాముదాయపు ప్రయోజననిధి రూ.40,000 లవరకు