Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

మును గవర్నమెంటు గ్రాంటును లోకల్ బోర్డు పొందుచు కొంత ధనమను కలుగ చేసికొనినచో గ్రంథాలయమును నిర్మింపవచ్చును. పరపతి సంఘమునుండి గూడ కొంతధనము పొందవచ్చును. మైసూరులోను, తంజావూరులోను ఒకోడాలోను పెద్దలకు, పిన్నలకు, స్త్రీలకు విజ్ఞానము కలుగ జేయుటకు ఏర్పాట్లు చేయబడినవి. స్థానిక సంస్థల తోడ్పాబును వుచ్చుకొననిదే తగిన ద్రవ్యము లభింపదు. తగిన కార్యము జరుగదు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ పునర్నిర్మాణమునకు విధానమును వేసి స్థానిక సంస్థలు చేసినట్టు, చెంగల్పట్టులో ట్రాస్కీ స్క్రీము పెట్టి మోటారు బండ్లలో పుస్తకములు వగయిరా తీసుకొని పోవుచు ప్రబోధము గావించుచున్నట్లు, గ్రామములలో ప్రబోధ మెక్కువగ జరుగవలసి యున్నది. అందులకు లోకల్ బోర్డుల అధ్యక్షఖలు తగు శ్రద్ధ వహించవలసినదని కోరుచున్నాను. అని తనయుపన్యాసములో అధ్యక్షుడు తెలియజేసెను.




బర్మాగ్రంథాలయ చరిత్ర

(మా.సుబ్బరామయ్యగారు)

పూర్వకాలమునుండియు, బ్రహ్మదేశము (బర్మ) ) సుభిక్షమగు దేశములలో బ్రధాన రాష్ట్రముగా పరిగణింపబడియె. పొడవు జీవనదులు - సారవంతమగు భూములు - సమశీతోష్ణ స్థితి - పుంజీకరములగు దట్టములైన యడవులు - మున్నగు స్వభావసిద్ధములైన సౌకర్యము లనేకములుండుట చేతను నానా విదేశీయ వ్యాపారులకును యద్యోగము నిరసించేడు కార్మికులకును నివాసస్థానమయ్యె కార్యాంతరులై వచ్చి నీ ప్రాంతమన నివాసమేర్పచురచుకొని యుండు రాష్ట్రతేరులు వారి దేశీయసాం