అందు ముఖ్యముగా మనమండలము అందు కృషి చేసి చేయూత నొసగుచుండెను. 1919, 1920 సం॥ లలో గాంధి యుద్యమము వచ్చినప్పుడు అందు ప్రజలందరు దిగిపోయి కృషి చేయుట చేత యీ ఆరేడు సంవత్సరముల నుండియు గ్రంథాలయోద్యమ విషయము మరచినారు. కాని యిటీవల దీనికృషి బాగా చేయవలెనని గుర్తించుచుండుట చాల సంతోషకరము.
పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం తాలూకా బోర్డు ప్రెసిడెంటు శ్రీ కలిదిండి గంగ రాజుగారు రూ 1300ల వ్యయముతో ఒక పుస్తక భాండాగారమును నెలకొల్పిరి. ఇటులనే పెక్కు గ్రంథాలయములు గ్రామములలో పెట్టబడినవి. కలిదిండి గంగ రాజుగారి వలెనే తక్కిన స్థానిక సంస్థలవారును యీ విషయములో తగు కృషి చేయవలసియున్నది. గ్రామములోని గ్రంథాలయము మూలమున విజ్ఞానాభివృద్ధి కలుగుచున్నది. ఆ తాలూకా బోర్డు వారు గ్రామ పునర్నిర్మాణమునకు వేసిన ప్రణాళికలో యీ గ్రంథాలయ స్థాపన మొకటి. గ్రంథాలయోద్యమమును వ్యక్తులు పురస్కరించుకొని చేసినంత మాత్రాన కావలసినంత నభివృద్ధి కాన్పించదు. దాని విశేషాభివృద్ధి స్థానిక సంస్థలయొక్క సహాయ శ్రద్ధాభిమానముల మీద నున్నది. నవనాగరకతగల దేశములలో యీ యుద్యమ వ్యాప్తి పెక్కు తెరఁగుల జరుగు చున్నది. ఒక చోట ఉపన్యాసము జరుగుచున్నదంటే అది అన్ని చోట్లకు తెలియుటకు రేడియో సెట్టు ఒకటి ప్రతిచోటను నిర్మింతురు. మాజిక్ లాంతరు మూలమున బొమ్మల జూపించి ఉపన్యాసముల నిచ్చుటయు, మోటారుబండిలో వివిధ గ్రంథములను గ్రామములకు తీసికొనిపోయి చదువుకొనువారికి అందిచ్చుటయు, మొదలగు నూతన పద్ధతులతో ఆ దేశములయం దీయుద్యమమును వ్యాపింప జేయుచున్నారు. ఈ పరికరములతో మన గ్రామములందును జరుపవచ్చును. దీనికి కొంత