తీసిపోకుండునట్లు ధన సహాయము చేసి ప్రోత్సహించవలెనని. దీనికి జవాబుగా గవర్నమెంటువారు వారికి సహజమగు నీ క్రింది 3 జవాబు యీయకుందురుగాక.
(1) దీనివలన ప్రజాసామాన్యమునకు లాభము చేకూరదు.
(2) గవర్నమెంటువారు దీనివిషయమై ఆలోచించుకున్నారు.
(లీ) గవర్నమెంటువారు గ్రంథాలయములను ఆర్థిక శాఖలో (సి) క్లాసుక్రింద వేసినారు.
గ్రంథాలయములు మానవుని జీవితములో యెటువంటి ముఖ్య స్థానము నాక్రమించుచున్నవో అధికారులు గ్రహించి దానికి చేయ తగిన సహాయమును శక్తి వంచనలేక చేయుదురుగాక యని కోరుచు నిరమించెను.
(మదాసు గ్రంథాలయ సంఘ కార్యదర్శి రంగ నాథంగారి యుపన్యాసమునుండి వెణుతురిమిల్లి శ్రీరామారావు గారిచే వ్రాయ బడినది.)
తూర్పు గోదావరిమండల గ్రంథాలయసభ
అధ్యక్షుని యుపన్యాససము
శ్రీ నరసింహ దేవర సత్యనారాయణగారు తూర్పుగోదావరి మండల గ్రంథాలయ మహాసభ కధ్యక్షులుగా నుండి చేసిన ప్రారంభోపన్యాసములో తమ కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియపరచి, తమకు చిన్నప్పటినుండియు గ్రంథాలయములతో గల పరిచయమును విశదపరచిరి. పదిపదునైదేండ్లకిందట గ్రామములలో గ్రంథాలయములు వ్యాపించియుండ లేదు. ఇతర రాష్ట్రములలో కంటె ఆంధ్రరాష్ట్రములో గ్రంథాలయోద్యమ మెక్కువగా వ్యాపించియున్నదని యీ