Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

గూర్చి సర్వలోక రంజకంబుజేయు సంగీతంబులును, ఆధునిక పండితాగ్రేసరుల గంభీరోపన్యాసములును, స్వరాజ్య సంపాదనార్థమై ఆత్మార్థపరిత్యాగ మొనర్చి కేవల భగవదాయత్త చిత్తమున తపస్సాచరించు యోగియుంబోలి నిష్కాముడైన మహాత్మా గాంధీ యుద్యమసం బంధ ప్రకటితములగు పష్టిపూర్త్యాది మహెూత్సవములును, గీర్వాణ భాషాభ్వాస విద్యార్థినీ పాఠకసునాదంబులును గల ఈసనాతన ధర్మమండలియను వృక్షము మెహెూత్కృష్టముగా విరాజిల్లుచు చిత్రవిచిత్రములగు విషయసముదాయము, ఇంద్రియముల భ్రాంతు లోడించి క్షణ క్షణము వేరొక మార్పునొందుచు నాశన హేతువగునట్లుగాక సర్వజగత్సృష్టీల యాదుల కధిష్టానమై, ఏకమై, నిత్యమై, సత్యమై, అద్వితీయమై ప్రకాశించు యాత్మ చందంబున నిర్మలమైన స్వధర్మమును విడక నాశిన హేతువులగు మార్పుల జెందక ఏకమై ప్రకాశించుచున్నది. ఇందు జరుగు కార్యములు శాశ్వతఫలము నిచ్చునవిగాని, ఇంద్రజాలమువలె తాత్కాలికమఁదు మోహింపజేయునవి కావు. కావున మెర మెచ్చులకు ద్రవ్యము వెచ్చించునట్లు ఈ కార్యమునకు అంతగా నొసంగ జాలరు. కానిండు, ధర్మమే జయము. దైవమే దీనిని గాపాడగలడు. ఈసమాజమునకు రాబడి, వ్యయము లీక్రింద జూడ గలరు.

225-8-0 జమ వారిక చందా వసూలు అయినది.
40-8–0 జమ ప్రసాదాలకు ధర్మముగా యిచ్చినది.
51-0-0 జమ నిత్యపురాణమునకు చందాయిచ్చినది.
327-0-0 మొత్తం
========
173-11-0
========
153-5-0 నిలవ నూటయేబది మూడు రూపాయల ఐదు అణాలు