80
Rsvmo A 145 Το 76 గ్రంథాలయ సర్వ స్వ ము ఖర్చు వార్షికోత్సవమునకు పండుగలకు చందా వసూలునిమి త్తం నోటీసుల ప్రింటింగు, రిపోర్టు ప్రింటింగు వగయిరాలకు గుంటూరు 173-11-0 -ఇ. వేంకమాంబ, కార్యదర్శిని. తాడేపల్లిగూడెం తాలూకాబోర్డు గ్రంథాలయం @ కడచిన అక్టోబరు (1929) మాసమునందు, తాడేపల్లిగూడెం తాలూకాబోర్డు వారిచే ధర్మగ్రంథాలయము పఠనమందిరము స్థాపిం పబడినవి. దీనికి రు 3,000 లు వెచ్చింపబడుటకు ఏర్పాటు గావింప బడినది. వివిధ విషయములను గూర్చి ఆంధ్ర గ్రంథములు 400 లును, ఆంగ్లేయ గ్రంథములు 100 ను ఇంతవరకు సేకరింపబడినవి. భారత వర్షమునం దన్ని రాష్ట్రముల నుండియు వెలువడు ముఖ్యములగు ఆంగ్ల వార మాసపత్రికలన్నియు తెప్పింపబడుచున్నవి. ఆంధ్ర రాష్ట్రము నందు ప్రకటింప బడుచున్న ఆంగ్ల ఆంధ్ర దైనిక వార మాసపత్రిక లన్నియు వచ్చుచున్నవి. ఈ గ్రంథాలయమును తాలూకా కంతకును కేంద్ర గ్రంథాలయముగ జేసి, ఇక్కడనుండి సంచార గ్రంథాలయ పేటికల మూలమున అన్ని గ్రామములకును గ్రంథములను అందజేయు టకై ఏర్పాటులు జరుగుచున్నవి. కడచిన మే నెలయందు ఈ తాలూకా బోర్డువారు 70 మంది ఉపాధ్యాయులకు గ్రామ పునర్నిర్నాణపు తరగతులు పెట్టి తరిబీతు నిప్పించి, అట్లు తయారైనవారు 40 గ్రామములలో పనిని ప్రారం భించియున్నారు. ఈ 40 గ్రామములకు ముందుగా ఈ గ్రంథాలయ ముయొక్క యుపయోగము నంద జేసెదరు. ఈ గ్రంథాలయమునకు