Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలవారై యుందురుగానే వారే గ్రామకూటమాన కధ్యక్షుడుకు కార్యదర్శియుపై యుండి, పైనిచెప్పిన కార్యభారము నిర్వహింప దక్షులైయుందురు. ఇట్టివారు విక్షేపము లేకుండ నిశ్చలదీక్షతో కార్యభారము నిర్వహింపగలుగుటకు గాను స్వతంత్య్ర జీవనులును గ్రాహకక్షలలో జేరనివారును, పరోపకారంతులను నయశీలసంపన్నులును గాజూచి ఏర్పరుచుకొనవలెను. అట్టి వీరప్పటప్పట స్థలాంతర విద్యాధికుల నాహ్వానించి గ్రామస్థుల సమావేశముచేసి వారి జ్ఞానాభివృకొద్దిగకును ఉద్బోనముకొరకును ఉపన్యాసములను చర్చలకు జరిగించవలెను.

ఈ సందర్భమున ప్రజాప్రబోధమున కుత్తమసాధన మగుప్రచారకుల సంఘమును గురించి కొంత చెప్పవలసియున్నది. ఇది శాఖా చంక్రమణమేమో యని భయపడుదురేమో, అట్టిభ్రము అసాంపృతము పైని చెప్పిన దానినిబట్టి గ్రంథాలయము సర్వవిధములైన జ్ఞానవ్యాపక సంఘములకును, ప్రచారక సంఘములకును, శరీరావయవసముదాయమనకు శిరమువలె, నుత్తమాంగముగా నుండవలసినది. జ్ఞానవ్యాప్తికిని, ధర్మప్రచారమునకును సాధన భూతములగు సర్వసంస్థలకునూ, గ్రంథాలయములకును అంగాంగ సహకార భావము కలదు. గ్రంధాలయము ప్రధానాంగము, తదికరములు, దాన్నిపై పరామరికకులోనై అది చేయు పనిలో దానికి సహకారులై దాని ప్రాపున పోషణ వర్ధనములనందునవై ప్రవర్తించవలెను. కావున, బడులు గ్రాహకూటములు, గ్రంధమాలలు, వార్తాపత్రికలు, ప్రచారిక సంఘములు లోనగునట్టి సర్వసంస్థలను గురించిన విషయములకు గ్రంథాలయ విషయమున అనుప్రవేశము కలదు. కావున ప్రచారిక సంఘ విషయమునకూడ నించుక చెప్పవలసి యున్నది. ప్రజోద్బోధనమునకు ప్రచారిక సంఘము అత్యవశ్యకములు, గ్రామసంచారము చేయుచూ పటనులు, మాజికులాంతర్లు మొదలగు పరికర సహాయ్యమున ఆరోగ్య శాస్త్రము, కృషిశాస్త్రము, రసాయన శాస్త్రము, ప్రకృతి శాస్త్రము లోనుగాగల యాధునిక శాస్త్రవిషయమున బోధసాగించుట కనేక సంఘములు నెలకొల్పబడి పనిచేయు చుండవలెను. గ్రంధాలయ సంఘమిట్టి సంస్థలకన్నిటికిని శిరస్టానమయి యుండవలెను. ఇట్టి సంస్థలు నెలకొల్పి మన విద్యాధురీణులు ధర్మదీక్షత, కార్యోత్సాహము కలవారయి వారి మూపున నిల్చియున్న పెనిచెప్పిన మహాకార్యభారము నిర్వహింప నప్రమత్తులయి నిరంతర పరిశ్రమకు గడంగుదురు గాక1! సర్వపదుద్యమా ధారుడగు పరమేశ్వరుఁడు వారి యద్యమముల సఫలము లొనర్చు గాత1

తీర్మానములు

1 అఁధులయుదు ప్రబోధము గావించి ఆత్మవిశ్వాసమును, ఆత్మగౌరవము - నెలకొల్పినట్టియు, భారతదేశమునందంతటను అంధుల ప్రఖ్యాతిని వెల్లడిజేసిన తన సర్వస్వమును మాతృ దేశారాధన కైసమర్పించినట్టి శ్రీరామభక్తులగు ఆం