29
మలవరచుట అదృష్ట శ్రుతపూర్వముగు మహా కార్యము. ఇట్టి కార్యభార నిర్వహణకు కొనసాగించుటకు గ్రంథాలయము లుంత్కృష్ట సాధనములు గాజాలియున్నవి. పైన చెప్పిన ప్రతిగామకూటములకును, ఆనుబంధముగా నొక్కొక్క గ్రంథాలయ మేర్పడి, పనిచేసినచో నీయుద్యను బీజములు నలుదిక్కుల నాటుకొని, అంకురించి, కొనలుసాగి, శాఖోపశాఖలబెంచి దేశమును గప్పగలవు. పగటి పాఠశాలలకును, రాత్రి పాఠశాలకును, గ్రామకూటములకును గ్రంథాలయమును అనుబంధములుగా నేర్పడి, అందు నేర్పబడు విద్య విషయమన పైన వివరింపబడిన కోదువలు దీర్చినగాని, విద్యాబోధ సర్వతోముఖముగ సాగజాలరు. ఈ చతుర్విధ సంస్థల విషయమునను వానిలో వాని కఁడవలసిన యన్యోన్య సహకారభావమును గురించియు కొన్ని విషయము లుపన్యసింపవలసియున్నది. గ్రంథాలయమున కార్యదర్శియు అధ్యక్షుడు నుండును, బడులలో కొంద రుపాధ్యాయలుందురు, వీరుగాక గ్రామములో గాని తత్పరిసర గ్రామములలో గాని ఆంధ్రగీర్వాణములుగాని యొక యాంధ్రమేగాని తెలిసిన పండితుడొక డుండకపోడు. మరియు నీ కాలమున ప్రతి గ్రామములోను ఆంగ్ల భాషాజ్ఞానమును ఆధునిక సంస్కారమునుగల యొకరిద్దరు వ్యక్తులందురు. వీరల సాహాయ్యమున పైని వివరించిన జ్ఞానవిజ్ఞాన సాగించు పనిలో నపొర సౌకర్యము లొదవును. గ్రామవాసు లీయుత్కృష్ట కార్యము నిర్వహించుటకు గాను మాసమున కిరుపదిరూపాయలు చందాల రూపమున చేర్చవచ్చును. కోర్టుదావాలు తగ్గించుకొని పంచాయతీలచే తగువులుదీర్చుకొని యందుకు ప్రతిఫలముగా కొంతమూలధనము గూర్చిన నీ కార్యమున కెంతయు సాహాయ్యభూత మగును లేదా లోకలుబోర్డులు మొదలగు స్థానిక సంస్ధలభిక్షు నపేక్షింపవచ్చును. ఈ మొత్తములో మాసమునకు పది రూపాయల వేతన మేర్పరిచిన పండితుడు దొరకును, అంతయ వేతన మొసంగిన ఆంధ్ర వార్తాపత్రికలను అంధ్రములో రచింపబడిన యాధునిక శాస్త్రగ్రంథములను జదివి అందలి విషయములు గ్రామకూటములో సమావేశమయినవారికి దెలుగల యొకవ్యక్తి లభ్య మగును, అనేక సందర్భపూలలో బడులలోని యుపాధ్యాయ్యుయీ పని కమరియుండును. ఇట్టివాని సాహాయ్యమన వారములో కొన్ని దినములు ఆరోగ్యశాస్త్రము, కృషిశాస్త్రము లోనుగాగల యాధునిక విజ్ఞానమును - కొన్ని దినములు గాని ప్రతిదినము గాని అరగంటకాలకు గాని లోక వార్తలను సమావేశమయినవారికి బోధింప వచ్చును. పైని చెప్పిన పండితునిమూలమున కొన్నిదినములు పురాణాదికాలక్షేపాదులచే సనాతన ధర్మోపదేశమును పరమార్థవిషయబోధయు పౌరింపవచ్చును. గ్రంథాలయమున కనుబంధముగా కొన్ని యాంధ్రవార్తాపత్రికల దెప్పించు చుండవలెను. అట్లయిన కావలసిన గ్రంధములకును పత్రికలకును కొదువయుండదు. గ్రంథాలయాధ్యక్షుడును కార్యవాసులకు, గ్రామవాసులును గ్రామములో కొంత పలుకుబడియు కొంత సంస్కారమును