ఈ విషయమున గ్రామకూటములకు సహకారులై గ్రంథాలయమాలు చేయవలసిన పని యపారముగా నున్నది. గ్రంథాలయముల వివరమును, అవి యిప్పటి కొనర్చుచున్న మహోపకార విషయమును, ఇక్కడ సమావేశమైనవారి కెల్లను తెల్లమైనదే కావునను, ఆ విషయములు తర్వాత నుపన్యసించు నధికృతులు సెలెవిచ్చెదరు కావునను, సంగ్రహముగా వివరించి విరమించెదను. గ్రంథాలయము లనగా, పైన జెప్పబడిన జ్ఞానవిజ్ఞానముల మూలమున మనుజునకు కావలసిన సంస్కారములను అలవఱచు గ్రంధసామగ్రిని సౌకల్యముగ సేకరించియు, భద్రపఱచియు, ఆ గ్రంథములకు జనోపయోగమునకై యిండ్లకు బంపుచుండియు, మహోపకారకములయి రాజమహేంద్ర వరము బెజవాడ లోనగు పెద్ద పట్టణములలో నెలకొల్పబడిన మహాసంస్థలు. ఇట్టి గ్రంథాలయములు శారదాపీఠములు, అవి యొకరీతి కళాశాలలే. ఇట్టి సంస్థల మూలమన నమెరికా మొదలగు పశ్చిమదేశములలో జరుగుచుండిన మహోపకారమును గుర్తించియే లోకానుగ్రహకాంక్షులగు మనదేశములోనే మహాపురుషులు ఆటి సంస్థలను మనదేశమున ప్రతిష్ఠింపసాగిరి. దేశ పురోభివృద్ధిపథమున నన్ని విషయములలోను అగ్రయాయియగు బరోడా మార్గదర్శి యయ్యెను. ఆ సంస్థానమున నిట్టి సంస్థలు ప్రభుత్వ యాజమాన్యమున సాగుతున్నవి. తక్కిన స్వదేశ సంస్థానములు బరోడా చూపిన త్రోవయే పట్టుచున్నవి. ఆంధ్రదేశమున 1898 వ సంవత్సరమున రాజమహేంద్రవరమున స్థాపింపబడిన వీరేశలింగ గ్రంథాలయము ఈ యుద్యకు ప్రథమ ఫలము. ఇదియే తర్వాత గౌతమీ గ్రంథాలయ మయినది, 1899లో భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామమున వీరేశలింగ గ్రంథాలయము అను పేర నొక గ్రంథాలయమును, 1911 వ సంవత్సరమున బెజవాడలో రామమోహన గ్రంథాలయమము పేర నొకటియును ప్రతిష్ఠింపబడి యున్నవి. నేటికి స్వంత మందిరములును కొంతయాస్తియుకల గ్రంథాలయములు, ఆంధ్రదేశమున సుమారు అరువదివరకును గలవు నామమాత్రముగా నున్నవి కొన్ని వందలు గలవు, ఇవిగాక మున్సిపాలిటీ మొదలగు స్థానిక సంస్థలచే నెలకొల్పబడినవియు కొన్ని గలవు. కాని వీని సఁఖ్యయు చేయవలసిన పనియు కావలసినదానిని విచారించిన అత్యల్పమని చెప్పక తప్పదు. 1913వ సం॥న నాంధ్రోద్యమము వచ్చిన దాక యీ సంస్థలు ప్రత్యేక వ్యక్తులుగ పని చేయుచుండెను. వీనికి సమష్టి జీవితమేర్పడి ఈ విషయమున పొగుచుండెడి ఉద్యమము యేకముఖరుయి బలపడ లేదు. 1914వ సం॥న బెజవాడలో ఆంధ్రగ్రంథాలయ సంఘమను పేరు నొక సమిష్టి సంస్థ యేర్పడి ఆంధ్రగ్రంథాలయ సర్వస్వ పత్రికాముఖమున ఈ యుద్యమ ప్రచారము సాగించినది. ఆకాలమున ఈ గ్రంథాలయోద్యమమును, వార్తాపత్రికోద్యమమును కొంత శ్రుబోధము గల్గించినవి. కాని మనదేశమనకు పూర్వోక్తమయిన ఈశ్వరోద్దిష్ట ప్రయోజనము సిద్ధించుటకయి వలయు సంస్కా
పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/12
స్వరూపం