త్వము వారిపై ఎక్కువగ ఆధారపడి యుండరాదు. ఒక వేళ వారు ధన మొసంగినను ప్రజల స్వేచ్ఛ నరికట్టి యనేక నిర్బంధములను ప్రయోగించెదరు” అని పలికిరి.
పిమ్మట శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు మహాసభకు శ్రీ చన్నాపగడ భానుమూర్తిపంతులు గారిని అధ్యక్షులుగా నుపపాదించిరి. ఉపపాదన మరికొందరు ప్రముఖులచే బలపరుపబడిన పిదప అధ్యక్షులు తమపదవి నలంకరించి ఉపన్యాసము గావించిరి. అందుండి, ఈ క్రింది భాగములు ప్రకటింప బడినవి.
అధ్యక్షోపన్యాసము
పెద్ద విద్యయనగా అక్షర జ్ఞానరూపమున చక్షురింద్రియ ద్వారమున గ్రహింపతగినది మాత్రమేకాదు, శాస్త్రపురాణోసన్యాసాది శ్రవణసాధనముచే శ్రోతేంద్రియ ద్వారామున గ్రహింపతగినవియు విద్యయే. మనస్ససంస్కాంర సాధనములగు నీ యభయాంళముల లోను శ్రోతేంద్రియ మూలకమగు రెండవయంశమునకే ప్రపంచమున ప్రాచుర్యము కలదు. మన వేదములు శ్రుతులు — మానవులలో అక్షరజ్ఞాన రహితులగువారి జ్ఞానవిజ్ఞాన సంపత్తి యంతయు శ్రుతిమూలకమే. ఏ దేశమందైనను సాక్షుల సంఖ్య పరిమితమే, మన దేశమున అట్టివారి సంఖ్య అత్యల్పము. ఇక నక్షర జ్ఞానము లేక పెద్ద వారైన గతియేమి? అరువది వత్సరముల వాని కక్షరాభ్యాసము దుష్కరము కదా? అట్టివారి జ్ఞాన విజ్ఞాన లబ్ధికి శ్రోత్రేంద్రియ మే శరణ్యము. కావున ప్రతి గ్రామమునను కల్గినవారిపిల్లల విద్యాసంస్కారమునకయి పగటిబడులును లేని వారిపిల్లల సంస్కారమునకై రాత్రిబడులనేగాక, పెద్దల సంస్కారమునకయి గ్రామకూటమాలు కూడ నేర్పడియుండవలెను. గ్రామ కూటములన నేమో వివరింపవలసియున్నది. గ్రామము లోని పెద్దవారందరును జ్ఞానాభివృద్ధికయి యొకచోట సాయంసమయమున సమావేషమయి, వారములో కొన్ని దినములు ప్రాచీన శాస్త్ర పురాణాది శ్రవణ మూలమున తమదేశీయ సంప్రదాయ విజ్ఞానమును, ఆత్మజ్ఞానమును, మరి కొన్నిదినములు ఆధునిక శాస్త్ర వార్తాపత్రికాది శ్రవణ మూలమున అధునికజ్ఞానమును, లోకజ్ఞానమును, సంపాదింపవలెను, ఇందులకై ప్రతి గ్రామమునకు నొక మందిరము నిర్మింపబడి యుండవలెను. ఇట్టి సంస్థలే గ్రామకూటములు, పిన్నల విద్యాభివృద్ధికి పగటిబడులును, పెద్దల సంస్కారమునకయి గ్రామకూటములును ప్రతి గ్రామమున ఏర్పడి, ప్రజలకు కొంత పంస్కారము గల్గించి, వారిని జ్ఞానగ్రహణోసన్మోఖులను చేసిననే కాని, ప్రజాప్రబోధమునకై నేను నా నాముఖముల సాగుతున్న ఉద్యమములెల్ల నిర్వీర్యములుకు నిష్ఫలములు నగును. క్షేత్రము చక్కజేసిన గాని బీజకులు నాటుకొని అంకురించనేరవు. పైని చెప్పిన త్రివిధ సంస్థలు లేనిచో మన వార్తాపత్రికలు గాని ధర్మోపన్యాసకులుగాని, స్వదేశోద్యమము తదితర ప్రతిష్ఠా పనములు గాని ఫలప్రదములు జయశీలములును గానేరవు.