Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వందే ప్రారంభ మాయెననియా, సహాయనిరాకరణోద్యమమందునూ, గుంటూరుమండలము మిగుల ఖ్యాతివహించెననియు, గ్రంథాలయోద్యమముందు ప్రధాన స్థానము నాక్రమింప జాలకపోయిన విశేషమగు కృషిసలిపెననియు పలికిరి. “ప్రతిగ్రామంలోను ఒక్కొక దేవస్థానమున కనుబంధ మగ నొక్కొక పుస్తక భాండాగార యుండుట వాంఛనీయము. గుంటూరు పట్టణమందలి పురపాలక సంఘ గ్రంథాలయము గ్రంధపఠనమునకే గాక, సమస్త రాజకీయ సాంఘిక మతవ్యవహారములకు, కాలక్షేపములకును కేంద్రస్థానమై యున్నది. అర్యవైశ్య గంథాలయను వారు విదేశ వ్యాపార వాణిజ్య పరిస్థితుల దెల్పు వార్తాపత్రికలను, నవీన గ్రంధములను వారి భాండారమునకు దెప్పించిన మిగుల ఉపయుక్తమగు పనిని గావించినవా రయ్యెదరు. గుంటూరు మండల మందిక వేటపాలెము నందిప్పటికి 10 సంవత్సరములకిఁద శ్రీ వూటుకూరి వెంకటసుబ్బరాయ శ్రేష్టిగారిచే స్థాపింపబడిన గ్రంథాలయము దినదిన మభివృద్ధినొందుచు, సర్వజనోపకారియై కడు ప్రశంపనీయ మగుసేవ గావించుచున్నది. మన దేశమందలి ప్రస్తుత పరిస్థితులు నభివృద్ధి పరచి, ప్రజలలో జాతీయ భావప్రబోధనను కలుగజేయుటకు గాని స్వరాజ్య సంపాదనకు గాని జనబాహుళ్యమందు విజ్ఞానమును విస్తరింపజేయు టత్యావశ్యకు, కేవలము పాఠశాల మూలమున నీ విజ్ఞాను వ్యాప్తి నొందవలయు ననిన వగిన రెండు మూడు తరములు పట్టును. పుస్తక భాండాగారికు లీ విజ్ఞానమును త్వరలో ప్రజందు వ్యా ప్తినొందింప గలవు. ప్రతి భాఁడాగారమనందును దేశ సేవాభిలాషియు, స్వార్ధరహితుడును, పండితులునగు నొకరు అభాండాగారము ననుసరిచించి యుండవలెను. చదువగలవారి కేయేవిషయములను తాము చదివి చెప్పవలెనో అట్టి కార్యముల నిర్వర్తింపగల సమర్థు లొకరుడిననే గాని కేవలము గ్రంథము లుండుటవలను నెట్టి ప్రయోజనము లేదు. ఈ గ్రంధాలయము లిదివారలో నసేకతావులు నెలకొల్పబడియున్నవి. పరప్రభుత్వ మున్నంతవరకును సాంఘికముగ గాని రాజకీయముగగాని, మతవిషయముగ గాని మన కెట్టిసహాయము జరుగబోదు. మనకు వారు తగినంత సహాయము గావింపలేదని కొరత పడుటయు యుక్తము కాదు. ప్రభుత్వము వారు సహాయమొనరించినను, చేయకున్నను ప్రజలే యీ యుద్యమవ్యాప్తికి పూను కొనవలెను, ప్రతి తాలూకా జిల్లా బోర్డులును పురపాలక సంఘమును ఫస్తక భాండాగారముల నెలకొల్పవలెను. జిల్లా సంఘము వారు ప్రచార గ్రంథాలయముల నేర్పాటుచేసి ఆయా జిల్లా ప్రజలందరికి యీ యుద్యమలాభముల నందచేయవలెను.

దేవాదాయముల కిపుడు ప్రత్యేక చట్ట యుకటి ఏర్పడియున్నది. ప్రతి గ్రామమందును యీ దేవాదాయము నుంచి వసూలగు ధనములో, కొంత గ్రంథాలయమునకై వెచ్చించిన, విద్యావిషయకముగ ప్రజలు కెంతియో మేలొనగూడును. ధనమునకై ప్రభు