Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

25

౧౨వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ. M వేచియుండుట చదువరికి చాల కష్టము. కనుక సంచారములో నున్న గ్రంధములకు మాత్రమే రిజర్వు కార్డుల నుంచుట మంచిది. గ్రంథసంచారము విస్తారముగానుండు పెద్ద గ్రంధాలయములో కొన్ని గ్రంధములు బాగు చేయించుటకు బైండింగు చేయుటకు వేరు చేయబడును. కొన్ని గ్రంథములు గ్రంధాలయమున నేమూలనో నిద్రించుచుండును. అట్టి గ్రంథములకై రిజర్వు కార్డుల నుంచుట నిరుపయోగము, రిజర్వుకార్డు పుచ్చుకొనిన పిమ్మట అందులోని గ్రంథమును రిజర్వు చేయుమను ఆర్డరుతో చీటిని అంటించి ఎరువిచ్చు గుమాస్తావ పంపలెను. గుమాస్తా తనకడకు ఆగ్రంథము వచ్చినపుడు పాలకుని కడకు పంపవలెను. పాలకుడు కార్డును చదువరికి పంపి, గ్రంథమును వేరుగానుంచును, నియమిత కాలములో చదువరి యా గ్రంథమును తీసి కొననియెడల దానిని యధాస్థానమున నుంచదగును. ఆలస్యమైన గ్రంథములకు నోటీసులు జాగ్రతగాపంపలెను. నోటీసులు సరిగాపంపిన యెడల గ్రంథముల కై కై అరుదుగా రిజర్వు చేయ వలసియుండును. రిజర్వు కార్డులు అనవసరముగా పడియుండనక్కర లేదు. రిజర్వు బుక్కు యేర్పాటు చేయక పూర్వము ఆలస్యమగు గ్రంథము లను తిరిగి తెప్పించుటకు సరియగు విధానము నేర్పాటు చేయవలసి యుండును.


౧౨వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహా సభ. ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ 28-7-28 తేదీ ఉదయము గుంటూరు నందు హిందూ హైస్కూలు భవనమునందు శ్రీయుత చన్నాప్రగడ భానుమూర్తి పంతులు గారి అధ్యక్షతక్రింద సమావేశమాయెకు. వివిధాంధ్ర మండల వాసులును, స్థానిక ప్రముఖుల నేకులును మహాసభ కరుదెంచిరి. ఆహ్వానసంఘాధ్యక్షోపన్యాసము, ఆహ్వాన సంఘాధ్యక్షు లగు శ్రీ దేశరాజు హనుమంత రావు పంతులు గారు ఆహ్వాన సంఘకూ తరఫున ప్రతినిధుల నాహ్వానించుకు ఆధోద్యమము గుంటూరు మండల