Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకురించిన సంస్కార బీజములు గురుకులవాసమునందు సద్గురుప్రసాదలబ్ధఙ్ఞానమువలన మొలకలెత్తి లోకానుభవముచే వృక్షమై మనఃపీడనమువలన ఫలప్రదమై త్యాగశీలమువలన పరిశుద్ధమై లోకోద్దతికి వినియోగపడుచున్న విచిత్ర సంస్కారము కుదిరిన మానవుని స్థిర సంకల్పములు సంఘ హృదయమున సంచరించుచు నుద్వేగమున నూతన మార్గములను కల్పించుకొని లోకవ్యవస్థల నుజ్జీవింపజేసి భావపరివర్తనమునకు దోడ్పడును.

భరతవర్షమునందు గృహమును, బ్రహ్మచర్యాశ్రమమును, ఆచార్యుడును సంస్కారమునకు మహానిలయములు. భరతవర్షమునందు గృహస్థాశ్రమము సకల ధర్మానుష్ఠానములకును మూలము. నిష్ఠుర బ్రహ్మచర్యమువలన చిత్తశుద్ధియు ఇద్రియ నిగ్రహముకు సంయమమును కలుగును. మనోసంయమమువలన సకల సంస్కారములును సిద్ధించుచున్నవి. ఆచార్యుడు ధర్మజ్ఞుడు. సత్కర్మోపదేశకుడు. భారతధర్మమునందాచార్యుడు సర్వపూజ్యుడు. లోకపరికల్పితములైన వ్యవస్థలందు భారతగృహమద్వితీయము. గృహరాజ్యమునకు స్త్రీ రాజీని. సంఘతంత్రమును, రాజ్య తంత్రమును గృహపాలనమునందునిబిడీకృతములు, భావిధర్మములును, భావ్యౌన్నత్యమును వర్తమాన స్త్రీ వర్గమునందు ప్రక్షిప్తము. మాతృగర్భమున శిశువునందు నాటుకొనిన సంస్కారాంకురములు సద్గురూపదేశమువలనను, క్షణమువలనను క్రమవికాసమునుగాంచి ఫలప్రదములగుచుండును. నారదమునితత్వోపదేశముతో మాతృగర్భమునం దుద్భవించిన ప్రహ్లాదుని భక్తిసాగరము, పరమభాగవతకథా శ్రవణ, మనన, ధ్యాన, కీర్తనములవలన నుప్పొంగి జగత్తునంతను ముంచివేసెను. కణ్వాశ్రమమునందు శకుంతల పొందిన చిత్తసంస్కారము అమెను పతితిరస్కృతను గావింపలేకపోయెను, సత్యవంతుని ప్రణయామృతమును గ్రోలిన సావిత్రీదేవి సేవావ్రతమునుబూని యమపాశములను భేదించి భర్తను పునర్జీవితునిజేసెను. చిత్త సంస్కారములేని యోగులు బ్రహ్మపదమునుండి పతితులగుచున్నారు. రాజులు, రాజ్యభ్రష్ఠులగుచున్నారు. జాతులు క్షీణించుచున్నవి. దేశములు నశించుచున్నవి. సంస్కారప్రభావముచే దుష్టులు సాధువులగుచున్నారు. మూర్ఖులు పండితులగుచున్నారు. చండాలురు దేవత్వమును బొందుచున్నారు. శత్రువులు మిత్రులగుచున్నారు. అప్రత్యక్షము ప్రత్యక్షమగుచున్నది. విషము అనుృతనుగుచున్నది. మానవులు అరురత్వమును బొందుచున్నారు. లోకము ద్వేషభావము లేక మంగళప్రదమగుచున్నది. మానవుల సకలాభీష్ఠములు సిద్ధించి భూలోకము స్వర్గతుల్యమగుచున్నది.

తమ సంతానమునకు ఉచితసంస్కారములను చేయుట గృహస్థులకు పరమధర్మమని స్మృతులు విధించుచున్నవి. తల్లిదండ్రుల సుశిక్షణమువలనను ఉత్తమవిద్యార్థనమువలనను పిల్లల శక్తిసామర్ధ్యములు వికసించి ఉత్తమపౌరులై, ధర్మనిష్ఠులై జాతికలంకార ప్రాయులగుదురు. శిశుపోషణమును శిశుపాలనమును సంఘాభివృద్ధికి లక్షము. అక్షరాభ్యాసము ఆర్యులషోడశసంస్కారములలో నొకటి యగుటయే విద్యాప్రతిపత్తి స్మృతికర్తల లక్షమునందుండెననుటకు ప్రబలతార్కాణము. మనదేశమునందు ప్రాచీనకాలమున గురుపదము సర్వోత్కృష్టము. ఆచార్యులు సర్వజనపూజ్యులు. వారు సంఘమునకు ప్రాజాపత్యము వహించి తరతరములకును ఆరాధన యోగ్యులైరి. రఘవంశగురువగు వశిష్ఠుని ఇతిహాసము చిరస్మరణీయము. ప్రాచీనార్యసంఘమునందు గురువర్యునకుగలస్థానము పృధివీపతికైననులేకుండెను. ఆస్థితినేటికిని కొద్దిగానో గొప్పగనో కలదు; కాని చాలవరకు సంఘాకర్షణశక్తి ప్రస్తుతమాచార్యునినుండి మరలినది. ఆశక్తి మారుముఖము పెట్టినప్పటినుండియు గురుశిష్యలవాత్సల్యము కృశించినది. ఒండొరులకుండవలసిన సమాన ప్రత్యయభావము పోయినది. ఆధునిక గురువునకు సంఘమునందు లక్ష్యములేదు. సంఘలక్ష్యము లేని గురువర్గము శిష్యకోటికి లాభప్రదము కాదని మనమిప్పుడే గ్రహించుచున్నాము. గురుశిష్యుల పరస్పరానురాగాభావమునకు మనదేశమునందు తరుచు విద్యార్ధులు కట్టుకట్టి విద్యాలయములకు పోకుండుటయే నిదర్శనము. గురువునకు శిష్యవాత్సల్యమును, శిష్యునకు గురుభక్తియు నున్న యెడల - పాట్నా విద్యార్థులకును విద్యాలయాధికారులకును భేదభావమంకురించినప్పుడు తిరిగి యుభయపక్షములకును పొందు పొసగుటకు కొందరు మధ్యవర్తు లెందుకు