జాతీయవిద్య
గాని తదితరవు బడిలో గాని సముపాలు కే కంపెనీ వారు హక్కుఁగలిగియుందుకు. “ఇంతియగాక, పైరెండు సంవత్సరములేగాక యె ల్లప్పటికిని మద్రాసు పట్నపు రేవులో కంపెనీవారి పక్షు మున జరిడి యెగుమతి దిగుమతుల సరకులపై పన్ను లుండవు. కాని రేవు దాటి మా రాజ్యములో కాని యిత రనాయకుల రాజ్యములో కాని కంపెనీవారు సరుకులు కొనినను అమ్మినను అట్టి సరుకుల మీద, నితరవత కు లిచ్చెడిపన్నులో సగమాయవలసియుందుకు. “మరియు సదకు కం పెనీవారు ఆచంద్రార్కము గటంకసాల స్వంతముగ నేర్పాటు జేసికొని నాణెములు జేయుట కధికారమిూయడమైనది. అందునకై యేర్పడిన కూలివాండ్ర వేలినములు దప్ప నితరములగు పన్ను లేని యు నీయనక్కరలేదు. “మద్రాసుపట్నములో నిప్పుడున్నట్టిగాని, యిక మీదవచ్చి నివసించెడి గాని వర్తకులకు, అద్దకులకు, సా లెవాండ్రకును, మానమ్మకముమీద మీరు వర్తక సరిలో అప్పులిచ్చి వారా వాగ్దత్తములను చెల్లించనియడల మీ కు వారివ్వవలసిన సొమ్ము మేము చెల్లించడమగును; లేదా వారు మార్క్యెములో న్చెటనున్నను మీకు వప్ప గింత పెట్టఁబడఁగలరు. రేవుపట్టణములోనిఁగాని పడవ లమీదగాని ఉపయోగార్థమై యాంగ్లేయులు మారా జ్యములోకొ నెడి తినుబండారములకు నెట్టివిధములగు పన్నులనీయనక్కరలేదు. “ఆంగ్లేయులయొక్క గాని వారితో వర్తకముచే యుటకై శుద్రాసు రేవునకు వచ్చిన మరియేజాతివారివి గా ని పడవలు ప్రమాదవశమున మునిఁగి మారాజ్యములోని కోస్తాకు కొట్టుకొని వచ్చినయెడల హత శేషములగు స " ✓ రుకులు పడవలు అడిగిన వెంట నే యీయఁబడును. ” 99 జూలై ౧౬3F. ఈకాలు తెలుఁగులో వ్రాసిస్లోపే కనుపడదు. ఏల యన, మద్రాసుపట్నములో కోటఁగట్టవలసి వచ్చినప్పు డు తానుకోట నిర్మాణమునకై ముందుగ డబ్బు పె పెట్టుబ పెట్టెదనని వాగ్దత్తము చేయలేదనియు, తనమాటలను తర్జుమాఁజేసి 'డే దొరగారికి బోధపరచిన ద్విభాషివలన నాంగ్లేయులు పొరపాటు పడిరనియు వెంకటాద్రినా యకుఁడు వాదించెను.
జాతీయ విద్య
లోకము విజ్ఞానమయము. చిరకాలసంవర్ధితంబైన లోకవిజ్ఞానము సకలజాతులందును, దేశములందును పరికల్పితము. విజ్ఞాన మయంబులైన జాతులు దేశములు వ్యక్తి వికాసమునకును, లోకపరిణామమునకును దోడ్పడు చున్నవి. లోక కళ్యాణమునకును, మానవాభ్యుదయమునకు తోడ్పడని వ్యక్తులు, సంఘములు, జాతులు వర్ధిలక నశింపగలవు. లోక వ్యాప్తంబైన వివిధవ్యక్తులు, సంఘములు, జాతులు, దేశములు వర్ధిలుట దైవనిర్ణయము. దైవనిర్ణయము లోకవ్యవస్థులందు పరికల్పితము. దైవనిర్ణీతములైన సకల వ్యవస్థలు వేరువేరు యుగములందు భిన్నరూపములను దాల్చుచుండును. నూతన వ్యవస్థలకనురూపముగ నూతన ధర్మములుకు, నూతనోద్యమములును, మానవకోటియందు తలయెత్తుచుండును. సకల ధర్మములకును, సకలోద్యనుములకును విజ్ఞానము కీలకము. విజ్ఞానరహిగములైన వ్యవస్థలుగాని, యుద్యమములుగాని చిరకాలము నిలువజాలవు. ధర్మసంవర్థితములైన సంమవ్యవస్థలను పోషించుట విజ్ఞానవయులగు మానవులకు కర్తవ్యము. యుగసంధియందు తలయెత్తిన ధర్మరక్షణము సామాన్యమానవులకు సులభసాధ్యముకాదు. యుగసంధియందు మహానుభావులుదయించి కార్యపరతంత్రులై దైవనిర్ణీతమైన కార్యము సాధించెదరు. కార్యసాధనమునందే విజ్ఞానబలోపేతులగు మానవులకును జ్ఞానరహితములగు క్షుద్రజంతువులకును విభేదము గన్పట్టుచున్నది. మానవులు సంస్కార స్వరూపులు; క్షుద్రజంతువులు సంస్కారరహితములు. కర్మవేక్షాపరత్వమునకును, కార్యసాధకమునకును సంస్కారము మూలము. జన్మకు సంస్కారము ఫలము. మానవుల సర్వసంస్కారములు జన్మతో ప్రారంభమగుచున్నవి. జన్మతో