Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

గ్రంథాలయ సర్వస్వము ఏతత్పూర్వ యుగములందు వూజయే లేదనుట తప్పు. శరదృతువు ఆశ్వీజ మాసముతో నుదయించుచున్నది. అందు శుక్రవార ముఖములతిమనోహరములు. వర్ధమానములు. కర్మయోగ్య ములు. పూజాప్రయుక్తమగు ఆర్యకర్మ నానాముఖము ల దీపించినట్లు ఇతిహాసములు సెప్పుచున్నవి. యజ్ఞము లు, యాగములు, దండయాత్రలు, సరస్వతీ పూజనములు మున్నగునవి కొన్ని సనాతనకర్మలు. పూర్వయుగము నందు శరదృతువు సరస్వతీ పూజారంభముతో నైక్యమ గుచుండెను. సరస్వతీపూజ వైదిక యుగమందుఁగూడ బ్రచారములో నుండెను. సరస్వతి వాగధిష్ఠానయగు దేవత. స్రవంతీమతల్లియైన పుణ్యవాహిని. ఋగ్వేదము నందు సరస్వతిని బ్రబోధించు అనువాకము ల నేకము లున్నవి; కాని సరస్వతి వేదయుగమునాటికి కేవల వాణీపాలినిగా భావింపఁబడి నట్లు తోపదు. సరస్వతి యిసుకపడకలలోఁబడి ప్రవ హించు చక్కని నది. పెక్కు ఋషికులము లీ నది కిరు కెలకుల నుండెడివి. వారి పరిమళ్ళు సరస్వతీతోయము తోఁ బెరిగెను. వారి వనస్పతులు సరస్వతీనీరములు త్రా వి ఫలవంతములయ్యెను. వారి పూలతీగెలు సరస్వ తీ జీవనాధారముచే కొనసాగి కుసుమించెను. మహర్షు లీనదిలో స్నానమాడిరి. మహషి పుత్రికలీయేటి నీళ్లెత్తి కొనిపోయిరి. మహర్షుల యావులీ కల్లోలవతి యొడ్డు న మేసి ఛాయావృక్షములక్రింద నిలచి నెమరు వెట్టెను. అందువలననే సరస్వతి పేరు వారికంత ఆప్తముగ స్త వనీయమయ్యెను. ఈ క్రింది సూక్తిని జదువుఁడు. ఋక్కు. పావకానః సరస్వతీ వాజే భిర్వాజినీవతీ! యజ్ఞం వష్టుధి యావసుః ॥ అర్థము. పరిశుద్ధిని, అన్నమును, ధనమును గలుగఁజే యునట్టి సరస్వతీ దేవి (యజమానునాకీయవలసిన) అ న్నాది సువస్తువులతో వచ్చి మా యజ్ఞకర్మను నెఱ వేర్చును గాక! ఋక్కు. మహోఅర్థః సరస్వతీ | ప్రచేతయతికేతునా! ధియోవిశ్వావిరాజతి॥ అర్థము. (నదీరూపమగు) సరస్వతి (ప్రవాహరూప మగు) కర్మచేత కావలసినంత యుదకమును ఇచ్చుచు న్నది. సమస్తమైన ( కర్మానుష్ఠానయోగ్యములయిన ) బుద్ధులను ప్రకాశింపఁజేయుచున్నది. ఈ పైసూ క్తములవలన సరస్వతి నదీరూపిణియగు దే వతగా భావింపఁబడిన దనుట నిశ్చయము. ఇది వైదిక యుగ విషయము. కాని ఆయుగమందే సరస్వతి అన్న దాయినిగా ధ్యానించినట్లు అచ్చటచ్చట అనువాకము లు కలవు. సరస్వతి పాలుపిండును, వెన్న తీయును, అంతేకాదు ఋజువులును, రసవంతములును నగు వా క్కులను బ్రసాదించును. ఇట్టి వింకను గొన్ని విశేషణ ములు సరస్వతీకి వాడఁబడియున్నవి. నదియైన సరస్వ తిని దేవతగా గొలుచుటలోఁ జక్కని యర్ధమున్నది. నదుల యుభయపార్శ్వములయందును బచ్చని పొలము • లు వధి౯ల్లును. చక్కని పట్టణములు కట్టఁబడును. ణిజ్యవ్యాపారములు సాగును. అన్యోన్యస్థలాంతరములకు చనవు సరసము లభివృద్ధియగును. వేయేల నాగరకతా వికాసములు నదుల వంటియె వ్యాపించి తేజరిల్లినవి. నై లునదీతీరమునందె ప్రాచీన మైన ఈ ఉప్తు నాగరకత మొలచి మోహ పెట్టెను. సింధుగం గామహా వాహినులతో ఆర్యుల సనాతన సభ్యతయైక్య మైనది. తెనుగు సీమయందు ప్రాక్త నాంధ్రనాగరకత గోదావరీ వీచికలపై ఉయ్యాలలూగి నది. అందువలన నే నదులు పూజ్యములయినవి. మఱియు ఆగ్యులసంధ్యావందన సంకల్పమునందు సైతము స్మరణీ యములుగా ననువదింపబడినవి. కాని ఈ భావము కాల క్రమాగతమయిన భేదార్థమున కగ్గమయినది. కావ్యక్రీడ నము పుష్పించినకాలమున T