విజయదశమి
కాలము
.| తే. | “కాలచక్రంబు ◆ నిరవధి కంబు దీన | |
అని భీష్మాచార్యుని నిర్వచనము. కాలమునకు ఆద్యంతములు లేవు, వృద్ధిక్షయములు లేవు. ప్రాత క్రొత్తలు లేవు. అనంతమయిన కాలస్వభావము కేవలభావనీయమనివ్యాస మహర్షి మతము; కాని ఈ కాలస్వభావస్వరూపముల నన్వేషించుటకు బొత్తుగా అవకాశములు లేకపోలేదు. కాలము నెవ్వరో సనాతన కవులు చక్రమునకుఁ బోల్చిరి. ఇందుగంభీరమైన ధ్వనికలదు. చక్రస్వరూపమున 'ఆద్యంత’ నిరూపణము దుర్లభము. చక్రస్వభావమున 'భ్రమణము' నైజవిలాసము. కాల మెప్పుడును స్థావరము కాదు. కావున చాలనీయమనుట క్రమాగత సిద్ధాంతము. ఐఁక నీ కాలచక్రమందు అవయవప్రకార మెట్లు నిరూపింపబడినదో చూతము. కాలమందు దీఘ౯మయిన అగ్రభాగమునకు యుగమని పేరు. హ్రస్వమయిన ఆది భాగమునకు నిమేషమని పేరు. ఇట్టి నిమేషములు ౧౮ ఒక కాష్ట. 30 కాష్ట లొక కళ. 3౬౦ కళ లొక ముహూత౯ము. 3ం ముహూత౯ము లొక దినము. 3౦ దినము లొక మాసము. ౨ మాసము లొక ఋతువు. 3 ఋతువు లొక అయనము. ౨ ఆయనము లొక వత్సరము ఇట్టి వత్సరములు ౧౭,౨౮,౦౦౦ కృతయుగమున గడచినవి. ౧౨,౯౬,౦౦౦ త్రేతాయుగమందుతరించినవి. ౮,౬౪,౦౦౦ ద్వాపరమునదాటిపోయినవి. ౪,౩౨,౦౦౦ కలియుగమును ముగింపనున్నవి. ఇందో సరికి ౫౦౧౭ మానుషాబ్దములు నడచినవి. సృష్టి ఆదినుండియును ఈనల సంవత్సరముతో ౧౯౫,౫౮,౮౫,౦౧౭ యేండ్లు గతించినవని గణకులు సిద్ధాంతీకరించుచున్నారు. ఈ సృష్టి ఏసృష్టియో చెప్పలేము. ఇన్ని సంవత్సరములనుండియును విజయదశమి మహోత్సవ మారాధనయందున్నదో లేదో చెప్పలేము. కాని ఒక మాట నిజము. వత్సరము"ను మానవుడెపుడు కాలమానముగా నంగీకరించెనో అప్పటినుండియు ఋతువిభాగము వచ్చుచున్నదనుట కేవలమూహాసిద్ధాంతము కాదు. ఆరు ఋతువులలో
శరదృతువు
నకొక విలక్షణత్వ మున్నదనక తప్పదు.
| శ్లో. | వాషి౯కంసంజహారేంద్రో | |
అని మహాకవి శరదాగమమును సూచించెను - వానకొఱకై వహించిన ధనువును ఇంద్రుఁడుపసంహరించెను. విజయ ప్రియుడై రఘుమహారాజు చాపమునులేవనెత్తెను. శరదృతు వనేక విధముల పూజాఋతువనుటకు సంశయము లేదు. వానలు వెనుకపడును. పృధివియంతయు క్షాళితమయిన తేజస్సుతో పచ్చబడును. ప్రవాహముల యందుదకములు ముక్తకాలుష్యములై స్నానీయములగును. కావురుగమ్మిన దిశాచక్రములు సహజసౌందర్యములతో వెలుఁగును. పొలమంతయు మొలకపైరుతో మోహనముగా నవనవలాడును. ఆకురాలిన మోడడవులు నల్లబాఱిన యాకు జొంపములతో సాంద్రములగును. దుద్దిన పీడితములయిన తామరకొలకులు మరల సంపూణ౯శోభలతోఁ బ్రఫలములగును. పగలు ప్రసన్న వాతములతో సూర్యుఁడును, రాత్రులు కర్పూరాతపములతోఁ జంద్రుడును లోకముయొక్క ఉత్సవప్రసక్తినిఁ బ్రేరేపింతురు. అందువలననే కర్మానుష్ఠానయోగ్యమగు నీ ఋతువును ఆర్యులు పూజాపురస్సరముగ నామతించిరి. మొదటినుండియును శరదృతువు నందు విజయదశమి ప్రథానోత్సవదివసముగాఁ బరిగణింపఁబడినదని వాదించుట ప్రమాదము. విజయుఁడు స్వకీయవిజయోత్సవముచే అమృతముగా జేసిన యుత్తమదివసమగుటవలన విజయదశమియని పేరెక్కినది. విజయుఁడు కుంతీపుత్రుఁడు. పాండవమధ్యముఁడు. వీరు ద్వాపరాంతమందున్న మహావీరులు. అప్పటినుండియు నీదినమందు వీరారాధన జరుగుచున్నదని చెప్పిన యుక్తముగ నుండును. కాని