- "ఆద్యేఆత్మని వాసనిత్యరసికే ఆనందమాధత్స్వమే” అనియు,
- 'రమ్యేరమ్యత రేరనేరసకలే రక్తాంశు కేరంజకే'
అనియు మధురముగా కాళిదాసు దేవినుపాసించెను. అధ్యయనము నిత్యబ్రాహ్మణవిధిగా నంగీకరించుసరికి
| శ్లో. | సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | |
అను సులభసూక్తిధ్యానవాచికముగా నల్లికొనియెను.'ఆధునిక కాలమందు మానవ స్వభావమునందున్న సంగీత సాహిత్యములును, కళాకాంతులును, భాషాభావములును, ఉద్దేదీపింపఁజేయు మధురార్ద్రశక్తుల కన్నిటికిని సరస్వతి అధిష్ఠాన దేవతగా భావించి అర్చింపఁబడుచున్నది.
ఈక్రింది పద్యము లిందులకు దార్కాణములు.
| ఉ. | పాలును నీరు వేఱుపఱు | |
| శా. | తల్లీ! నిన్ను దలంచి పుస్తకముచే | |
జైత్రయాత్ర
క్షత్రియులకు దిగ్జిగీపాతృవ తీండ్రించు దినములి వియె. వానలాగిపోయి, త్రోవలెండుటచే సేనాగమనము సుగమమగును. రఘువు దిగ్విజయ యాత్ర నభివర్ణించుచు కాళిదాను
| గీ. | “దాటుటకు నర్హముగ నదుల్ ♦ దనరఁజేసి | |
అని కాలయోగ్యతను నిరూపించెను. రాజులు సామాన్యముగా నీఋతువును విజయ యాత్రాకాలముగాఁ బూజించిరనుట నిర్వివాదము. అప్పటినుండియే ఆయుధపూజ ప్రారంభమైయుండవచ్చును.
శ్రీహర్షుని సత్రయాగము శరదృతువునందు జరిగెను. బౌద్ధులత్రివేణీ పరిషత్తు కార్తిక జ్యోత్స్నలలో సనుకూడెను. శ్రీకృష్ణుని రాసక్రీడనము శరత్తునందేరాణించెను. ధర్మజుఁడు రాజనూయమును ఈ శుభదినములలోనే జరిపించెను; ఇంకెందుకు మహభారత యుద్ధమె కార్తీక బహుళమున జరిగినది. కాని విజయఁఁడీ శరత్ర్పారంభమునకు స్థాయిపూజను గల్పించెను. లేనిచో నిది భారతవషీ౯యులకు జాతీయోత్సవకాలముగాఁ బాదుకొనియుండదు. భారతవీరులలో అర్జునకుఁగల పూజ్యపదవి యనన్యమయిన దనక తప్పదు. ఒక పక్షమున భారతకధారచనకు నాయకుఁడే అర్జునుఁడని చెప్పవచ్చును. రధానురధికులు ప్రాణవిసజ౯నము చేసి యశోమాజ౯న మొనర్చిన మహాభారత రణనాయకత్వము అర్జునునకు గట్టిపెట్టుట నిర్వివాద విషయముకాదు. కాని తత్వజ్ఞులీ నిణ౯యమునకు విరుద్ధులుకారు. భారతపాఠకులకు మొట్ట మొదట రంగమందు మహత్తరమగు
భీష్మ తేజస్సు
పరిస్ఫుటము గాఁ గానవచ్చును; కాని భీష్ముడువీరుఁడుగా కంటెనాచార్యుఁడుగా నధిక ప్రశంసనీయుఁడయ్యెను. అదిగాక ధర్మాధ౯ కామమోక్షములు నాల్గింటను నీకురుకులతిలకుని జీవితము యధాపూణ౯ పరిణామమును బొందలేదు. భీష్ముని మహాసంగ్రామమందు నాయకుఁడనుట కంటే, ఆ వీరకుటుంబమందు రాజషి౯యనుట సమంజసము. తరువాత వస్త్రధారులలో ద్రోణకృపాశ్వద్ధాములు మ లు వత్తురు. వారందఱును బ్రాహ్మణులు. ఆచార్య పీఠస్ధులు. పాలితులుగాని పాలకులుగారు. వీరు సుయోధన నియోగమందుండిరి కావున యుద్ధమునందంజవేసి పోరాడిరి; అంతేకాని వీరుండినందువలన యుద్ధము దాపరింపలేదు. వీరి జీవితములు వృత్తిధర్మమునందుత్తమపురు