20 గ్రంథాలయ సర్వస్వము
ముల కుపయు క్తములైన పుస్తకములు తగినన్నిలేని లోపమును పూర్తిచేయుటకును, విజ్ఞానవ్యాప్తి కుపకరించు పలురకముల కరపత్రము లచ్చొత్తించి ప్రచారము గావించుటకును తాలూకా, పట్టణగ్రంథాలయ సంఘముల సాయముబడయుటకై యీ సభవారు సలహా నిచ్చుచున్నారు.
౧౬ గవర్న మెంటు నిషేధించిన గ్రంధముల జాబితాను సంపాదించి ప్రకటించుటకై శ్రద్ద బూనవలసినదిగా నీసభ వా రాంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారిని కోరు చున్నారు.
౧౭ గ్రంథ భాండాగారుల శిక్షణ తరగతుల నేర్పాటు చేసి వానిని ప్రభుత్వము గుర్తించునట్లు ప్రయత్నము చేయవలసినదిగా నీ సభవారాంధ్ర దేశగ్రంథాలయ సంఘము వారి నర్తించుచున్నారు.
౧౮ గ్రంథాలయ బిల్లుయొక్క ఆవశ్యకత నాలోచించి అవసరమగుచో దానిని తయారు చేయుటకు ప్రవీణులగు వివిధ గ్రంథాలయ
సంఘ ప్రతినిధులు కొందటి నొక యువ సంఘముగా నేర్పాటు చేయుటకై యీ సభావారాంధ్రదేశ గ్రంథాలయము వారిని
కోరుచున్నారు.
౧౯ ఏవైన గ్రంధములను గ్రంథాలయమున కుచితముగా నొసంగదలచువారు దానిని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమున కప్పగించి గ్రామములో తాలూకా గ్రంథాలయ సంఘములద్వారాను, నగరములలో పట్టణ గ్రంథాలయ సంఘముద్వారాను పంచి పెట్టించుటకై యీ సభవారు కోరుచున్నారు.
౨౦ నూతనముగ మంత్రిత్వ స్వీకరణ మొనరించిన మద్రాసు కాంగ్రెసుమంత్రులు నీసభవారు హృదయ పూర్వకముగ నభినందించి గ్రామోద్ధరణకై యెంతయో యుపకరించు గ్రంథాలయ విషయమున వారత్యంతశ్రద్ధను వహింతురని విశ్వసించుచున్నారు.
౨౧ గ్రంథాలయముల అభివృద్ధి కాటంకముగానున్న
(ఆ) 213 నెంబరు లోకలు బోర్డు సర్క్యులరును రద్దు చేయుటకున్ను,
(అ) 1860 సం॥ 21 వ చట్టప్రకారము గ్రంథాలయములను రిజిస్టరు చేయించుటకు నిర్ణయించిన రు 50 ల రుసుము తీసి వేయుటకున్ను,
(ఇ) రిజిస్టరు చేయబడిన గ్రంథాలయములకు గ్రంథములను కొనుటలో జిల్లా విద్యాశాఖాధికారి యనుమతి యుండవలయునను నియమమును తీసివేయుటకున్ను,
(ఈ) గివర్న మెంటువారిచ్చు గ్రాంటు మొత్తమునకు సరియగు మొత్తమును కొన్ని గ్రంథాలయముల వారు (జిల్లాబోర్డు గ్రంథాలయములు, రిజిస్టర్డు గ్రంథాలయములు) వెచ్చింపవలయునను నియమమును గవర్నమెంటువారిచ్చు గ్రాంటు మొత్తమును కొన్ని కార్యములకు మాత్రమే వెచ్చింపవలయునను నియమము తొలగించుటకున్ను,ఈ సభవారు మద్రాసు ప్రభుత్వమువారి నర్థించుచున్నారు. మీ రాష్ట్ర.
౨౨ గ్రంథాలయముల గ్రాంటుల నిమిత్తమీ రాష్ట్రమున కనీసము లక్షరూపాయలైన ప్రత్యేకించి గ్రంధాలయముల సర్వతోముఖ వికాసమునకై ఆ మొత్తమును వెచ్చించుటలో గ్రంథాలయ నిర్వాహకులకు సంపూర్ణ స్వాతంత్య్రమును ప్రసాదించుట కీ సభవారు మద్రాసు ప్రభుత్వమువారిని ప్రార్థించుచున్నారు.
౨3 మద్యపాన నిషేధమువలెనే నిర్బంధోచిత ప్రాధమిక విద్యనుగూడ నొక జిల్లాలో వెంటనే ప్రారంభంచవలసినదిగా మద్రాసు ప్రభుత్వము వారి నీ సభవారు కోరుచున్నారు.
౨౪ అర గ్రంథాలయ భవన నిర్మాణములకు అర్ధగ్రాంటుల నిప్పించవలసినదిగా మద్రాను ప్రభుత్వము వారి నీ సభవారు కోరుచున్నారు.
౨౬ శ్రీయుత “ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు” గారి "మాలపల్లి" పై నిషేధము తొలగించినందులకు సంతోషమును వెలిబుచ్చుచు తక్కువగల తెలుగు గ్రంధముల పైగల నిషేధమును తొలగించుట కీ సభవారు మద్రాసు ప్రభుత్వము వారిని కోరుచున్నారు.
౨౬ దొరతనము వారిచే ప్రచురింపబడు పారిశ్రామిక ఆరోగ్యవిషయక వ్యవసాయక ప్రచురములను జిల్లా గజెటీలను ఆంధ్రభాష యందు ముద్రింపబడు గ్రంథముల పట్టికలను గ్రంథాలయములన్నిటికిని ఉచితముగా నొసగుటకై ప్రభుత్వమువారి నీ సభవారు వేడుచున్నారు.
౨౭ ఈ సభవారు హిందీ రాష్ట్రభాషగా నుండుట కంగీకరించుచు మాతృభాషయం దన్వయజ్ఞానము కలుగులోపల వేరొక భాషను విద్యార్థులకు నేర్పచూచుట వ్యర్థమనియు హిందీని ౧,౨,3 ఫారములలో నిర్బంధము చేయుటనవసరమనియు తలంచుచున్నారు.
౨౮ మద్రాసు రాష్ట్రమునగల తెలుగు జిల్లాల నన్నిటిని కలిపి ప్రత్యేకాంధ్ర రాష్ట్రముగా నిర్మించుటత్యవసరమని యీ సభవారు తీర్మానించుచు అందులకై వలయు నాందోళన చేయవలసినదిగా ఆంధ్ర దేశీయులను ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘము వారిని ఆంధ్ర అసెంబ్లీ కౌన్సిలు సభ్యులను ఈసభవారు కోరుచున్నారు.
౨౯ రాయలసీమయని పిలువబడుచున్న కడప, కర్నూలు, బళ్లారి, చిత్తూరు, అనంతపురం జిల్లాలలోని కళాశాలలను ఆంధ్ర విశ్వవిద్యాలయమున వెంటనే చేర్చవలసినదని ఆంధ్ర విశ్వవిద్యాలయాధికారులను మద్రాసు ప్రభు