పాలెము, సేవాశ్రమము వారి నవ్యప్రయత్నము నుగ్గడించుచు తాలూకాలోని యితర ప్రాంతములలోగల యితర కాలువల పైనడచు పడవలందును, నిట్టి గ్రంథాలయములు స్థాపించు ప్రయత్నములు చేయవలసినదిగా తెనాలి తాలూకా గ్రంథాలయ సంఘమువారి నీ సభవారు కోరుచున్నారు.
౫ ఏయుద్యమములో గాని ప్రజాసేవ చేయువారి కేవిధమైన బిరుదులు నొసఁగుట మంచిదిగాదని యీసభ వారు తీర్మానించుచున్నారు.
౬ గ్రంధక ర్తలను, పత్రికాధిపతులను వాని ప్రచురణకర్తలను తమ తమ ప్రచురణముల నుచితముగా తమ గ్రంథాలయముల కిప్పించవలసినదిగా వేడికొనుట గ్రంథాలయ నిర్వాహకులకు ధర్మము కాదని యీ సభవారు తలచుచు బాల్యదశయం దున్న గ్రంథాలయములకు కొంత బలము గలుగువరకు వానికి ప్రోత్సాహము కలిగించు నిమిత్తమై, గ్రంథకర్తలు, పత్రికాధిపతులు, ప్రచురణ కర్తలు తమ తమ ప్రచురములను తాలూకా పట్టణ గ్రంథాలయముల సిఫారసు ననుసరించి కొంత తగ్గింపు రేట్ల కిచ్చుటవసరమని యీ సభవారూహించు చున్నారు.
౭ తెలుగులో వెలువడు నుపయుక్తమగు ప్రతి నూతన గ్రంధమును కొని గ్రంథకర్తలకు ప్రచురణ కర్తలకు తగిన ప్రోత్సాహమిచ్చుచు మాతృభాషాభివృద్ధికి సాయపడవలసినదిగా నీ తాలూకాలోని గ్రంథాలయముల నీ సభవారు హెచ్చరించుచున్నారు.
౮ నేడు విద్వాంసులు, కవులు, గాయకులు, మొదలగువారిని సన్మానించి పోషించు ప్రభువులరుదైన౦దున అభారమును విజ్ఞాన వ్యాపన మాదర్శముగాగల గ్రంథాలయముల నిర్వాహకులు చేయుటవసరమని యీ సభవారభిప్రాయపడు చున్నారు.
౯ ప్రస్తుతస్థితిలో ప్రతియూర నొక సమగ్ర గ్రంథాలయమును స్టాపించి చక్కగా నిర్వహించుట సాధ్యము కాదు కనుక గ్రామ గ్రామమునకు కనీస మొక పఠనాలయమును స్థాపించి ప్రతిఫిర్కాకు నొక కేంద్ర గ్రంథాలయము స్థాపించి నడపుట బాగుండునని యీ సభవారు అభిప్రాయపడుచున్నారు.
౧౦ మన దేశమున ముఖ్యముగా గ్రామములో నివసించు జనులకు మన గ్రంథాలయములు గాని, అవి తెరచియుండు కాలముగాని, అందుబాటులో నుండి విజ్ఞానార్జనకు సరియగు నవకాశములు కల్పించుట కభ్యంతరముగా నున్నందున ప్రతి గ్రామ గ్రంథాలయము నిత్యము రాత్రి వేళల ౨ గంటల కాలము తెరచి యుంచబడి చదువురానివారలకు పుస్తకములను, ముఖ్యముగా పత్రికల చదివి వినిపించుటకై యేర్పాట్లు చేయుటవసరమని యీ సభవారు అభిప్రాయపడుచున్నారు.
౧౧ ప్రచురణ గ్రంథాలయములకును, గ్రంథాలయ సంఘములకును జీవము కనుక ఇప్పటిలో ఆంధ్రదేశములోని వివిధ గ్రంథాలయములును, గ్రంథాలయ సంఘములును వ్యక్తిగతముగ నందునిమిత్త మెక్కువ మొత్తముల వెచ్చింప నసమర్థము లైనందునన తెలుగుపత్రికల యజమానులు విజ్ఞానవ్యాప్తికి దారిజూపి జాతివికాసమునకు తోడ్పడుటలో ప్రాధాన్యము వహించు గ్రంథాలయములకు సంబంధించిన సమాచారములను చక్కగా తమ పత్రికలలో ప్రకటించుచు అప్పుడప్పుడు గ్రంథాలయ క్షేత్రమున గన్పట్టు నూతనోద్యమములు తమ సంపాదకీయములద్వారా నుగ్గడించుచు మధ్యమధ్య నీయుద్యమ వ్యాప్తి విషయమై తమ సలహాలు వెలువరించుచు గ్రంథాలయోద్యమమునెడ తమ ధర్మమును నిర్వర్తించుటకై యీ సభవారు ప్రార్దించుచున్నారు.
౧౨ శ్రీయుత కాళీపట్నం కొండయ్య గారి సంపాదకత్వమున రాజమహేంద్రవరము నుండి ప్రకటింపబడుచున్న “విజ్ఞానం" పత్రికకు యీ సభవారు స్వాగతమిచ్చుచు, ఆధునికయుగమున కవసరములైన ముఖ్యములగు శాస్త్రవిషయములను ప్రత్యేకముగ తెలియజేసెడి యీ నూతన ద్వై మాసపత్రిక నాదరించవలసినదిగా ఆంధ్ర గ్రంథాలయమువారు నీసభవారు కోరుచున్నారు.
౧౩ గ్రంథాలయోద్యమవ్యాప్తికై ప్రారంభింపబడి, ఆర్ధిక చిక్కులకు లోనగుటవలన నితర ఉద్యమముల చేపట్టవలసిన “గ్రంథాలయ సర్వస్వము " యొక్క స్థితికి ఈ సభవారు వగచుచు నిజస్వధర్మనిర్వహణమే ముఖ్యముగా చూచుకొనుటకు సరియైన అవకాశములను కల్పించి స్వస్వరూపముననే బయల్వెడలునట్లు చూచుటకై దీని నిర్వాహకులను ఆంధ్రదేశ మందలి గ్రంథాలయ సేవకులను ఈ సభవారు ప్రార్దించుచున్నారు.
౧౪ ఆంధ్రదేశములోని వివిధ పట్టణ, తాలూకా, జిల్లా, రాష్ట్ర సంఘములు పరస్పర మన్యోన్యాశ్రయముగలిగి యేకలక్ష్యమునకై కృషి యొనర్చుటకు గాను ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారి నిబంధనలయందు మార్పులు సూచించుటకై నేడు పెదపాలెములో కూడబోవు గ్రంథాలయ సంఘ ప్రతినిధుల యిష్టాగోష్ఠి సమావేశ ప్రయత్నము నీ సభవారు పూర్ణముగా బలపఱచుచున్నారు.
౧౫ ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమువారు వివిధ విషయములకు సంబంధించిన చక్కని పుస్తకములు తెలుగులో వ్రాయించి ప్రకటించుటచే ఆంధ్ర గ్రంథాలయ