Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి తాలూకా గ్రంథాలయ మహాసభ

ఆరవ సమావేశము

రేవేంద్రపాడు

ఒక వైపున నిర్ఘరారావముతో ప్రవహించుచున్న కృష్ణ వేణీ పావనతో యములు కన్నులపండువు సేయుచుండ వటవృక్షచ్ఛాయలు ప్రతినిధులకు స్వాగతమిచ్చుచుండ, ప్రకృతి రామణీయకమగు ఆరుబయలు ప్రదేశమున ౧-౮-3౭ వ తేదీ మధ్యాహ్నము రేవేంద్రపాడు గ్రామములో పైసభ దిగ్విజయముగా జరిగినది. తాలూకాలోని వివిధ గ్రామముల నుండి, గ్రంథాలయ పఠనాలయముల పక్షమునను, వ్యక్తిగతముగను విచ్చేసిన ప్రతినిధులు దాదాపు అరువదిమంది గలరు. కాక చుట్టుపట్టులనుండియు విచ్చేసిన ప్రేక్షకులును, గ్రామస్థులును నాటి రాత్రికి పెదపాలెంలో జరుగనున్న గ్రంథాలయ సంఘప్రతినిధుల యిష్టాగోష్ఠి సమావేశమున కరుగుదెంచిన ముఖ్యులగు గ్రంథాలయ సేవకులును కలసి సభికుల సంఖ్య సుమా రిన్నూరు గలదు. ఇతర తాలూకాల నుండి విచ్చేసిన గ్రంథాలయ సేవకులలో శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు, భూపతిరాజు తిరుపతిరాజు గారు, తేతలి సత్యనారాయణమూర్తిగారు, మల్లెల శ్రీరామమూర్తి గారు, మైలా శామ్యుయల్ గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ముఖ్యులు.


చుండూరు వాస్తవ్యులగు శ్రీయుత గండవరపు వెంకటేశ్వర్లు గారి ప్రార్ధన సభాకార్యక్రమము ప్రారంభంమాయెను. తరువాత తెనాలి తాలూకా గ్రంథాలయ కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణంగారు సభకు విచ్చేసిన గ్రంథాలయ సేవకుల నందఱికి నెఱుక పరచిరి.

ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము

అనంతరము శ్రీయుత చల్లపల్లి మురహరిరావు గారు మహాసభకు విచ్చేసిన ప్రతినిధులకు ప్రేక్షకులకు స్వాగతమిచ్చిరి.

ప్రారంభోపన్యాసము

అంతట సభాప్రారంభకులగు శ్రీయుత కస్తూరి కుటుంబరావుగారు కరతాళధ్వనుల మధ్యలేచి, తమ యుపన్యాసము నిచ్చిరి.

అధ్యక్షోపన్యాసము

తరువాత శ్రీ పాతూరి నాగభూషణంగారిచే 'ఉపపాదింపబడి, సభికుల కెరుక చేయబడి, మరికొందరు ప్రతి నిధులచే బలపరుపబడిన పిమ్మట శ్రీయుత పుణ్యమూర్తుల రాజశేఖరం గారు అధ్యక్షస్థానము నాక్రమించి, తమ యధ్యక్షాభిభాషణమును జెప్పిరి.


డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి గారు:

పిమ్మట తాడేపల్లిగూడెం తాలూకా గ్రంథాలయ సంఘ కార్యదర్శులగు డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి గారు మనపూర్వపు ఔన్నత్యమును స్మరించి, ప్రస్తుతము మన దేశదుస్థితికి కారణము మనము స్వాతంత్య్రమును గోలు పోవుటే యనియు, తిరిగి మనము స్వాతంత్య్రమును పొందవలెనన్న గ్రంథాలయములు, పఠనాలయములు మిగుల నవసరమనియు, వీనికై సంవత్సర చందాలు సరస్వతీ కట్నముల ద్వారా ధనము సంపాదించవలెననియు మొదలుగా గల సంగతుల జెప్పి చివరకు తాలూకా గ్రంథాలయ సంఘముల విధులను వివరించిరి.

తీర్మానాములు

౧ కీ. శే. వల్లూరి సూర్యనారాయణరావు, తోకల నాగయ్య, విచారపు వెంకటదాసు, సూర్యదేవర రాఘవయ్యచౌదరిగార్ల ఆత్మలకు శాంతి గలుగుటకై యీసభవారు పరమేశ్వరుని ప్ర్రార్ధించుచున్నారు.

౨ తమ చరిత్ర పరిశోధనాపటిమచే మద్రాసు విశ్వకళా పరిషత్తువారి మెప్పుపొంది, పి.హెచ్.డి. బిరుదము బడసిన గుంటూరు హైందవ కళాశాలచారిత్ర కోపన్యాసకులగు డాక్టరు మారేమండ రామారావుగారి నీ సభవారభినందించుచున్నారు.

3 తెనాలి తాలూకా గ్రంథాలయ సంఘము వారు తాలూకాలోని గ్రంథాలయ, పఠనాలయము అన్నిటి నుండి వానియభివృద్ధిని గూర్చిన నెలసరి రిపోర్టులను తెప్పించి అవసరమయినవారికి తగిన సలహాలిచ్చుచు సంవత్సరమున కొక తూరియైన ప్రతి గ్రంథాలయమును పరిశీలించుటకు తగిన యేర్పాట్లు చేయవలసినదిగా ఈసభవారు కోరుచున్నారు.

౪ పడవలో ప్రయాణము చేయు బాటసారుల విసుగుదలను తొలగించి సత్కాలక్షేపమున కనువగు చక్కని యవకాశ మొసగు బోటు గ్రంథాలయముల బ్యాంకు కాలువ పైనడుచు ప్రయాణీకుల పడవలలో స్థాపించిన పెద