త్వమువారిని అందులకై వలయు శాసనములను, శాసన సభలలో ప్రవేశ పెట్టవలయునని ఆంధ్ర అసెంబ్లీ కౌన్సిలు సభ్యులను ఈ సభవారు కోరుచున్నారు.
30 కేంద్రంథాలయముల వద్ద బ్రాడ్ కాస్టింగు నొక దాని నేర్పఱచి ప్రతి గ్రామ గ్రంథాలయముల వద్దను రిసీవింగు పెట్టు (Valve Set) నెలకొల్పవలయుననియు అందువలన నుపన్యాసము లాకర్షవంతముగా ప్రజలకు విన్పింపబడును గాన వెంటనే స్థానిక ప్రభుత్వము వారట్టి కార్య విధానమునకు గడంగవలసినదనియు ఈ సభవారు హెచ్చరించుచున్నారు.
తీర్మానములన్నియు పూర్తిగాకమునుపే పెదవడ్లపూడి నుండి పిడపఱ్ఱుపోవు బోటువచ్చుటచే అందరును మధ్యలేచి లాకువద్దకు వెళ్లి సేవాశ్రమము వారునడపుచున్న బోటు లోని గ్రంథాలయము దర్శింపవచ్చిరి. అల్పాహారముల యనంతరము మిగిలిన తీర్మానములు పూర్తిచేసిన పిమ్మట, అధ్యక్షుల ఉపసంహర వాక్యములతోను, ఆహ్వాన సంఘాధ్యక్షుల వందన సమర్పణము తోడను సభా [1] వ్యహారము సమాప్తమయ్యేను. శృగారపురవాస్తవ్యులు శ్రీయుత నాగేశ్వరం సుందరశర్మ గారు కడపట శ్రీ ఆదిపూడి సోమనాథరాయ కవి రచించిన ఆంధ్రమాతృస్తవమును పఠించి సభికులకు మంచి ప్రబోధము గావించిరి.
సభానంతరము ప్రతినిధులును ఇతర తాలూకాలనుండి వచ్చేసిన గ్రంథాలయ సేవకులను పెదెపాళెములో జరిగిన గ్రంధాలయ సేవకుల యిష్టాగోష్ఠి సమావేశమున పాల్గొను నిమిత్తము ప్రయాణమైపోయిరి.
కేంద్ర గ్రంథాలయావశ్యకత
గ్రంథాలయ సంస్కరణము
శ్రీ ఆత్మకూరి గోవిందాచార్యులు గారు
ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యమము ప్రశంస నీయముగ కొనసాగుచున్నది. కడచిన యిరువదేండ్లలోను ఎన్నియో ఉద్యమములు తలలెత్తినవి; కాలప్రవాహమున తలలు వంచినవి; రూపుమాసి అనంతసాగర సంగమము నొందినవి.
ఆంధ్రులారంభళూరులు. ఉత్సాహోద్రేకములు వీరిసొమ్ము. ఆరంభించి పరిత్యజించుటయందాంధుల కితరులెవరును సాటిరారు. ఆయినను గ్రంథాలయోద్యమ మీ ఆంధ్రుల నైసర్గిక లక్షణముల కేలనో గుఱికాలేదు. బాలారిష్టము అన్నియుఁ గడతేరినవి. ఇందులకు గ్రంథాలయోద్యమ ప్రచారకులు స్తవనీయులు; ధన్యులు, ముఖ్యముగ కాలప్రవాహమున గంతులు వేయుటకై గ్రంథాలయోద్యమమును విడనాడక నిశ్చలకృషి సల్పిన అయ్యంకి వెంకట రమణయ్యగారు ఆంధ్రుల కృతజ్ఞతకు పాత్రులు. ఇంక గ్రంథాలయోద్యమము నవయౌవనముతో, నూత్న శోభాలంకారములతో, దినదిన ప్రవర్ధమానమై చిరంజీవి కాఁగలదనుట నిశ్చయము. కాని, ఆత్మావలోకనమున కిదేతరుణము.
ఆంధ్ర దేశమునందుఁగల ముఖ్యపట్టణములయందెల్ల నేఁడు పేర్కొనఁదగిన గ్రంథాలయములు కలవు. పలుతావుల పల్లెలయందుఁ గూడ గ్రంథాలయములు వెలసినవి.
ఎన్నియో గ్రంథాలయములకు సొంతభవనము లున్నవి. ప్రతి గ్రంథాలయమున ఎన్నెన్నియో వేలకొలది గ్రంథము లున్నవి. అయిన నేమి? ఈ గ్రంథాలయములన్నియు నిర్ణీత కార్యక్రమము ననుసరించి, నిర్మింపఁబడినవి కావు. వీని కొండొంటికి సహకార కార్యక్రమ ప్రణాళికయు లేదు. ఆంధ్ర గ్రంథాలయముల నన్నింటిని, ఏకోన్ముఖముగ, ఒక నిర్ణీత కార్యక్రమ ప్రణాళిక ననుగురించి, తేజోవంత మొనరింపఁగల కేంద్ర గ్రంథాలయమును లేదు. ఏ గ్రంథాలయమునందుఁగాని, ఏ ఒక ప్రత్యేక విషయమును గుఱించియైన, సంపూర్ణ పరిశోధనము గావించుటకు వలయు గ్రంథములు లభింపవు. “ఇది పరిశోధన గ్రంథాలయ” మని పేరిడదగిన గ్రంథాలయ మాంధ్ర దేశమున లేదనుట సాహసముకాదు. సంచార గ్రంథాలయములు లేనే లేవు.
గ్రంథాలయముల పుస్తకములు జాబితాల నొకపరి సింహావలోకన మొనరించుచో, అన్ని గ్రంథాలయముల యందును, అధిక సంఖ్యాకములగు పుస్తకము లొకేరకమునకుఁ జెందియుండును. ఎక్కడ చూచినను పురాణములును, కథలును, నవలలును, నాటకములును, కావ్యములును గోచరింపక మానవు. ప్రాచీన విజ్ఞాన కోశములగు తాటాకు పుస్తకములనన్ని గ్రంథాలయములు
వాంఛించుచునే యుండును. గ్రంధముల సంఖ్యపై మమత
- ↑ ప్రారంభకులు, అధ్యక్షులు, ఆహ్వాన సంఘాధ్యక్షుల యుపన్యాసములు ముందు సంచికలో ప్రకటింపబడును