Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 గ్రంథాలయ సర్వస్వము

ఆహ్లాద మొనగూర్చెడివి. “నాభవిష్యత్తు ఎట్లుండును! ముందుచదువు ఎక్కడ?" అను రెండే సమస్యలు నన్ను వేధించెడివి.

తుదకు ఉపాధ్యాయినివృత్తి స్వీకరింప నిశ్చయించితిని. ఎండ కాలపు సెలవులలో 'టిల్లీ సు’ లో రసాయనిక శాస్త్రపరిశోధనాలయములో చదువుచున్న నామిత్రులు కొందరు సెపనాకర్టుకు వచ్చిరి. వారిజీవిత చరిత్ర వినినంత నాకు ఉద్రేకము కలిగెను. వారినలె నేనును ఎట్లు చదువుకొందునా అను ఆలోచనలో నిమగ్ను రాలనైతిని.

దరఖాస్తు పెట్టితిని. జబాబునకు ఆదుర్దాతో ఎదురుచూచుచుంటిని. ఒకనా డొక వార్తా హరుడుమా ఇంటి గుమ్మముముందునిలబడినా చేతి కొక తంతినిచ్చెను. అందులోని అంశము లేవన

“విద్యాలయ ప్రవేశమున కనుమతి యిచ్చితిమి. తత్ప్రణము రమ్ము” ఈతంతి 'ఆర్టోనిక్ ఆర్దోనికిజె' లోని బోధనాభ్యసన విద్యాలయమునుండి వచ్చినది. విశ్వవిద్యాలయ విద్యార్ధిని కానుంటి నని నాకు కలిగిన ఆనందమేనా! నా తలిదండ్రులు కూడ నాకుకలిగిన అవకాశమునకు సంతసించిరి. పెద్దలనాటి పరిస్థితుల స్మరింపదొడగిరి. పాపము! వారి యుద్యోగము లెట్టివి? చెప్పులు కుట్టుట, గేటుకాపలా కాయుట, దర్జీపని చేయుట మొద లగునవి; ఈ పనులుతప్ప వా రితరము లెరుగరు. స్త్రీలలో ఒక తెయయినను అక్షరజ్ఞానము కలిగి యుండ లేదు.

‘ఆల్టోనికిజె’లో మొదటిరోజు ఉదయము పెందలకడనే సూర్యోదయమగుసరికి లేచితిని. నూతన జీవితమునుగురించి పెక్కు ఆలోచనలు నామనస్సున నిండినవి. చదువుటెట్లు? పరిచయులు లేరే క్రొత్తపట్టణములో ఒంటరిగా కాలము గడపవలె. అని నాలో నేను తర్కించుకొను చుంటిని. పాఠశాలకు గంట కొట్టక పూర్వమే వెళ్లితిని. అచట ఎవరును లేరు. వసారాలలో అటుఇటు పచారీలు చేయుచు తరగతిగదులయొ క్కయు - పరిశోధనశాలలయొక్కయు ద్వారబంధముల పై వైపున నున్న ప్రకటన ఫలకము లందలి వ్రాతలను తిలకింపదొడగితిని. ఇందే గదా నేను నాలుగు సంవత్సరములు చదువుకొన వలసియున్నది! నాకు రష్యన్ భాష రాదే! నిర్వ హించుట ఎట్లు? అనుభావములు క్షణికములై పొడగట్టినవి.

కొంత సేపటికి కిలకిలలాడుచు విద్యార్థులు నసారాలలో చేరిరి. చేతిలో వేలాడు సంచుల తోను చంకలో నిరికిన పుస్తకములతోను వారు చిన్న చిన్న గుంపులుగా చేరి ఉల్లాసముతో మాట్లాడుచుండిరి.వీరలు పాఠ శాలకు చిరపరిచయులు, క్రొత్త వారు కారు. పాఠశాల పెట్టిన తరువాత దాదాపు ఒక నెలకు సెప్టెంబరు 26వ తేదిని నేను పాఠ శాలలో చేరితిని. గంటకొట్టిరి. నామనసులో చెల్లా చెద ఆలోచనలన్నియు ఉపన్యాస ఉపన్యాస ప్ర్రాసాదములోనికి విద్యార్థులు ప్రవేశించిరి. వెనువెంట నేనును వెళ్ళితిని. రాయెను.

విద్యాలయములో చేరిన తరువాత జనెవరి నెలవరకు చదువులో అప్పుడప్పుడు నాకు చాలా తక్కువమార్కులు వచ్చుచుండెను. పదార్థ విజ్ఞానశాస్త్ర పరీక్షలో మూడు సార్లు తప్పితిని. చదువజాలనను సిస్పృహకు అప్పుడప్పుడు లోనైతిని. చదువుమాని ఇంటికి తిరిగి వెళ్లుచో నాస్థితి ఏమి? నాతలిదండ్రులేమ నెదరు సిగ్గు చేటు కాదా? అని తిరిగి తెలివి తెచ్చుకొంటిని. విద్యార్థి సంఘము నాకు చాల సాయపడెను. చాలమంది బాలికలు నాకు సాయమొనర్చిరి. వారితో బాటు నేను