సోవియటు విద్యార్థిని
రష్యను భాషను నేర్చుకొంటిని. కమేణా అభివృద్ధి కలిగినది. ఇదివరకుకన్న చాలా మెరుగు. మొదటి పరీక్షలో అన్నిటిలోను మంచిమార్కులువచ్చెను.
విశ్వవిద్యాలయములో మొదటి సంవత్సరము గడపితిని. అది నాభవిష్యత్తుకు పునాది. ఆసంవత్స రములో విద్యాలయము అచ్చటిజీవితము నాకు చక్కగా పరిచయమయ్యెను. పెక్కురు స్నేహితు లైరి. రెండవ సంవత్సరములో అన్ని విధముల మార్పుకలిగెను. 'చదువులన్నిటిలోను సెబా సనిపించుకొంటిని' కార్మికవిప్ల వపుపదు నేనన వార్షి కోత్సవ సందర్భమున నాకు రెండు పుస్తకములు బహుమతి ఇచ్చిరి. ఇది స్వల్పమేకాని నాకు అమూల్యము. కారణము - ఇదియే నేను పొందిన మొదటి బహుమానము.
ఈ విద్యాలయమున గ్రంథస్థ విద్యయే పర మావధికాదు. ప్రపంచానుభవము సమకూర్చు కొనుట విధ్యుక్తము. సోవియటు విద్యాలయము లోని, విద్యార్థి విద్యతోబాటు వికాస సౌష్ఠవ మును పొందవలెను. అందుచేత గడపదాటక కాలుగదపక కూపస్థ మండూకములుగా నుండ మండూకములుగా నుండ వీలు లేదు.
నేను విద్యార్థి సంఘముయొక్క ఒక ముఠాకు కార్యకర్తిని నైతిని. మాముఠా ఎప్పుడును అగ్రస్థానము వహించెను. సంవత్సరాంతమున మేము చేసినపనికి ఎర్రజెండా బహుమానమును పొందితిమి· మరుసటి సంవత్సరము నన్ను విద్యార్థి సంఘ కార్యదర్శినిగా ఎన్నుకొనిరి. ఇప్పుడు నేను విద్యాలయ సంఘ సహాయ కార్యదర్శినిగా పనిచేయుచున్నాను.
కొద్దికాలముక్రిందట మాకు జంతుశా పండితుడగు 'లేవు బోరిసోవిచ్' గారు విద్యా విద్యార్థి సంఘ కార్యాలయములోనికి వచ్చిరి విద్యాలయాధికారులు అప్పుడు చాలామంది బాలికలకు శాస్త్రపరిశోధనలో ఉన్నత విద్య నభ్యసించు అవ కాశమీయసంకల్పించిరి. పండితుడు నాతో " “ఆర్మిక్ ! నిన్ను కూడా పండిత శ్రేణిలోనికి తీసి కొనబోవుచున్నాము” అనెను. ఇది నాకు గలిగిన మహాభాగ్యము. రష్యను భాష ఎంతమాత్రము రాదని నిస్పృహ చెందిన ఆర్మీనియను బాలిక నగు నేను విద్యా అగ్రస్ధానము వహించి విద్యాలయము అందరికిని యొక్క ఉన్నతశ్రేణిలో చేరు ఇది లభించదు. భాగ్యము లభించెను కదా యని లోలోన సంతసించితిని. శాస్త్రపరిశోధనలకు ముందు కలుగగుల అవకా శములను ఊహించుకొని బింక పడితిని.
విద్యార్థులు ఖాళీ సమయములో వివిధ వ్యాసం గములందు పాల్గొందుకు. 'ఫొటొగ్రాఫ్' 'సంగీ తము' 'నాటకము' మొదలగు వివిధవర్గములు మెండు కలవు. నాకు పర్వతారోహణమన్న ఉత్సాహము ప్రంపంచములోని సుప్రసిద్ధ పర్వత శిఖరములను గురించి చాలవరకు చదివితిని. ఆల్ప్స్ పర్వతములను గురించి కూడా చదివితిని. "ఆప్టే" అను కార్మికసంచార సంఘము వారు విద్యాలయములో ఒక కమిటీని ఏర్పాటు చేయగా ముందు నేను సభ్యురాలనుగా చేరి నాతోడి స్నేహితులను కూడా పురికొల్పితిని.
సాయంత్రపు వేళ కార్మిక వనవిహారమున తఱ చుగా ఎదుటకనబడు కాక్సస్ మహాపర్వతపంక్తి యొక్క అద్భుతదృశ్యమును నేత్రానందము గొల్ప వీక్షించు చుండెడిదానను. మంచుతో నిండి తళతళ మెరయుచున్న “కాజ్ బెక్ శిఖ రము అందులో నన్నాకర్షించెను.
ఒకనాడట్లు విహరించుచుండ "కాజ్ బెక్"" శిఖరారోహణము శిశిరఋతువున చేయవలెనను